Telangana Aasara Pension Scheme: తెలంగాణ పగ్గాలను చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ (Congress Party)పెన్షన్ దారులకు షాక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే సాధారణ పెన్షన్ ను రూ. 4,000, దివ్యాంగ పెన్షన్ ను రూ. 6,000 చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాజాగా రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పెన్షన్లు డబ్బులే ఈ నెల కూడా ఇవ్వనున్నట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో లబ్దిదారుల ఖాతాల్లో సొమ్ములు జమ చేయనుంది సర్కార్. ప్రస్తుతం సాధారణ పింఛను రూ. 2,016, దివ్యాంగ పింఛను రూ. 4,016 ఇవ్వనుంది ప్రభుత్వం.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలపై హామీల వర్షం కురిపించింది. అందులో భాగంగా ఆరు గ్యారెంటీల పథకాన్ని ప్రవేశ పెట్టింది. అయితే.. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటిలోని రెండు పథకాలు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని పెంపు పథకాలను తెచ్చింది.తాజాగా ఆర్టీవీతో (Rtv) మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) మిగితా గ్యారెంటీల అమలు ఎప్పుడు జరుగుతుందనే దానిపై అప్డేట్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: సీఎం జగన్ కు మరో షాక్ తగలనుందా?
హమీలను నేరవేర్చుతాం..
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో ఇచ్చిన అన్ని హమీలను (Congress 6 Guarantees) నేరవేర్చుతాం అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హమీల అమలుపై నేడు రివ్యు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతాం అని తేల్చి చెప్పారు.
వచ్చే నెల నుంచి ఫ్రీ కరెంట్..
వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హమీ నేర వేరబోతుందని తెలంగాణ ప్రజానీకానికి గుడ్ చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయ్యిందని మండిపడ్డారు. అందుకే హమీల్లో కాస్త జాప్యం నడుస్తోందని అన్నారు. నిరుద్యోగ బ్రుతి మొదలుకుని డబల్ బెడ్ రూంల వరకు అన్ని హమీలను మీరు విస్మరించారని ఫైర్ అయ్యారు.
DO WATCH COMPLETE STORY HERE: