Telangana DSC: తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) తీపి కబురు అందించేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ కొలువు కొట్టేందుకు పల్లెలు వదిలి పట్నం వచ్చి ఒకపూట తిండి తింటూ అహర్నిశలు కష్టపడి చదువుతున్న విద్యార్థులకు ఊపిరి పిల్చుకునే వార్త ఇది. తెలంగాణ ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గతంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే, ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నిరుద్యోగులకు ఉద్యోగావకాశ కల్పనకొరకు ప్రయత్నాలు చేస్తోంది.
పూర్తిగా చదవండి..DSC Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్!
తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మొదటగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తం 12 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది.
Translate this News: