ఆరు హామీల అమలుకు రూట్ మ్యాప్ ఇదే.. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 'ప్రజాపాలన' కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఆరు హామీల అమలుకు రూట్ మ్యాప్ ఇదే.. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు
New Update

Congress six guarantees: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 'ప్రజాపాలన' కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా అన్ని గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ గజగజ.. సింగిల్ డిజిట్‎కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సదస్సు వివరాలు వెల్లడించారు. ముందుగా ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజలకు అందిస్తామని; ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల ద్వారా ఆ దరఖాస్తులను తీసుకుని రశీదులు అందిస్తామని తెలిపారు. ఎంత చిన్న ఊరైనా, గూడెమైనా సరే.. అధికారులే వెళ్లి దరఖాస్తులు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించినట్లు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుని, దరఖాస్తులు తీసుకుంటారన్నారు. అనంతరం దరఖాస్తుల పరిశీలన ఉంటుందని చెప్పారు.

#cm-revanth-reddy #praja-palana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe