/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-Revanth-Reddy-4-jpg.webp)
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి (Revanth Reddy CM) హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గెస్ట్ లకు ఆహ్వాన పత్రికలను పంపిస్తోంది ప్రభుత్వం. మరో వైపు రేపు ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోందన్న రేవంత్ రెడ్డి.. ప్రజలంతా ఈ మహోత్సవానికి హాజరు కావాలని బహిరంగ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సైతం ఆహ్వానం అందింది.
ఇది కూడా చదవండి: TS New Cabinet: ఆ 13 మందికి కేబినెట్ లో నో ఛాన్స్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హైకమాండ్!
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు (Ex CM KCR) సైతం స్పెషల్ ఇన్విటేషన్ పంపించారు. అయితే.. వీరు ఇరువురు ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి వస్తారా? రారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రం ఈ వేడుకకు హాజరుకానున్నారు. వీరితో పాటు రేవంత్ ప్రమాణ స్వీకారానికి అమర వీరుల కుటుంబాలకు సైతం ఆహ్వానాలు అందాయి. తెలంగాణ ఉద్యమకారులతో పాటు సమాజిక ఉద్యకారులను సైతం ఆహ్వానిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఆహ్వానం.
Telangana Government official invitation for Chief Minister Revanth Reddy's oath taking.#RevanthReddy #RevanthReddycm @revanth_anumula pic.twitter.com/eU31xiiYFw
— Congress for Telangana (@Congress4TS) December 6, 2023
ఈ మేరకు ప్రొఫెసర్ కోదండరామ్, కంచె ఐలయ్య, ప్రొఫెసర్ హరగోపాల్ కు ఆహ్వానాలు పంపించారు. వీరితో పాటు వివిధ పార్టీల అధినేతలకు రేవంత్ ఆహ్వానాలు పంపించినట్లు తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖులకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. దీంతో రేపు రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు హాజరు అవుతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.