Rythu Barosa: రైతు భరోసాపై రేవంత్ సర్కారు కసరత్తు చేస్తోంది. విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. సభ్యులుగా మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి, శ్రీధర్‌బాబు ఉన్నారు. రైతుభరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, 5 ఎకరాలకే రైతు భరోసా అమలు చేయాలా?, 8, 10, 15, 20, 30 ఎకరాల్లోపు రైతుల్లో ఎవరికివ్వాలని గ్రామాల వారీగా రైతుల అభిప్రాయం సేకరించనుంది ప్రభుత్వం.
స్పష్టత రాకపోవడంతో మరింత మంది సూచనల సేకరించనుంది. రెండుమూడు రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇవ్వనున్నారు అధికారులు. మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల నివేధిక ఆధారంగా రైతుభరోసా పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. జులై మూడో వారంలో రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బును జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.