Big Breaking: తెలంగాణలో దసరా సెలవుల తేదీలు మార్పు.. సర్కార్ కీలక ఉత్తర్వులు

దసరా సెలవుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెల 24న దసరా సెలవు ఉంటుందని మొదట ప్రకటించగా.. తాజాగా ఆ తేదీని ఈ నెల 23కు మార్చింది ప్రభుత్వం. దీంతో పాటు ఈ నెల 24న కూడా సెలవు ఉంటుందని స్పష్టం చేసింది.

Big Breaking: తెలంగాణలో దసరా సెలవుల తేదీలు మార్పు.. సర్కార్ కీలక ఉత్తర్వులు
New Update

Telangana Govt Dussehra Holidays: తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవు తేదీని మార్చింది. తొలుత ప్రభుత్వం ఈ నెల 24న దసరా పండుగ సెలవును ప్రకటించింది. ఆ మరుసటి రోజు అయిన 25వ తేదీ నాడు కూడా సెలవు ఉంటుందని వెల్లడించింది. అయితే.. ఆ దసరా సెలవును ఈ నెల 23కు మార్చుతున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరుసటి రోజు ఈ నెల 24న కూడా సెలవు ఉంటుందని వెల్లడించింది కేసీఆర్ సర్కార్ (Telangana Government). ఈ ఏడాది దసరా పండుగ విషయంలో కాస్త సందిగ్ధం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో 23 అని, మరి కొన్ని ప్రాంతాల్లో 24వ తేదీ అంటూ ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్వత్ సభ ఈ నెల 23న దసరా పండుగ జరుపుకోవాలని ఇటీవల స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Breaking News: నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు.. నుంచి నామినేషన్లు.. ముఖ్యమైన తేదీలివే!

ఈ మేరకు ప్రభుత్వం కూడా దసరా సెలవును ఈ నెల 24 నుంచి 23కు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలో దసరా సెలవులు ఈ నెల 24, 25 కు బదులుగా ఈ నెల 23, 24కు మార్చింది ప్రభుత్వం. తాజాగా ఇంటర్ విద్యార్థులకు కూడా దసరా సెలవులకు సంబంధించిన ప్రకటనను అధికారులు విడుదల చేశారు.

publive-image

రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఈ నెల 19 నుంచి దసరా సెలవులు (Dussehra Holidays) ప్రారంభం కానున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు (TS Inter Board) ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం ఈ నెల 25వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి. సెలవుల తర్వాత అక్టోబరు 26 నుంచి కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డ్ ప్రకటనలో పేర్కొంది.

#dasara-holidays #dussehra-2023 #telangana-government #cm-kcr #telangana-dussehra-holidays #dasara-holiday-changed
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe