/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/farmers-pm-kisan-jpg.webp)
Rythu Barosa: ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు భట్టి విక్రమార్క. ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రీమియం అంతా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. రైతులకు ఇది ఎంతోగానో ఉపయోగపడుతుందని వివరించారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. త్వరలో భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తామని కీలక ప్రకటన చేశారు. ఏదో గెలవాలని మేం ఎన్నికల హామీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి వరకు 2,26,740 ధరణి అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. కొత్తగా మరో 1,22,774 ధరణి దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1,79,143 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు.