తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ (Telangana Government) ఆరు గ్యారెంటీల అమలుపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నియమించారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). కమిటీ సభ్యులుగా శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), పొంగులేటి శ్రీనివాస రెడ్డిని (Ponguleti Srinivas Reddy) నియమించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీల అమలులో భాగంగా ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 25 లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి.
ఇది కూడా చదవండి: Telangana : పేదలకు గుడ్ న్యూస్.. శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు?
సీఎం రేవంత్ సమీక్ష:
అత్యధికంగా రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్స్ వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. 40 రోజుల్లో తమ హామీలను అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదననారు. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పామన్నారు.
ఇది కూడా చదవండి: TS Govt Jobs : ఆ ఉద్యోగ ఖాళీల భర్తీపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు!
వెబ్ సైట్ ప్రారంభం:
ప్రస్తుతం 30 వేల మంది ఆపరేటర్లతో వివరాల నమోదు వేగంగా జరుగుతోందన్నారు. ఇదిలా ఉంటే.. ప్రజాపాలన వెబ్‌సైట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. https://prajapalana.telangana.gov.in పేరుతో ఈ వెబ్ సైట్ ను రూపొందించింది ప్రభుత్వం. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ ను తెలుసుకోవచ్చు. మన దరఖాస్తు రశీదుపై ఉన్న నంబర్ ద్వారా లాగిన్ కావాలని అధికారులు సూచించారు.
ప్రస్తుతం దరఖాస్తులను ఆన్‌లైన్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. డేటా ఎంట్రీ పూర్తయ్యాక వెబ్‌సైట్‌లో అందుబాటులో దరఖాస్తు వివరాలు ఉంటాయి. ఈ నెల 17 వరకు డేటా ఎంట్రీ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ప్రజాపాలన కార్యక్రమంలో ఇప్పటివరకు కోటి 25 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.