Telangana New Mandals: తెలంగాణలో మరో మూడు కొత్త మండలాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన కేసీఆర్ సర్కార్ తెలంగాణలో మరో 3 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో వనపర్తి జిల్లాలో ఏదుల, నిర్మల్ జిల్లాలో మాలెగావ్, బెల్తారోడా నూతన మండలాలుగా ఏర్పాటు కానున్నాయి. By Nikhil 04 Oct 2023 in తెలంగాణ New Update షేర్ చేయండి ఏ క్షణమైనా అసెంబ్లీ ఎన్నికల ప్రకటన (Telangana Elections 2023) వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ (Telangana KCR Government) అలర్ట్ అయ్యింది. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న డిమాండ్లను సైతం నెరవేర్చుతోంది. ఈ మేరకు నిత్యం ప్రభుత్వం నుంచి ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా మరో మూడు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రైమరీ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ నోటిఫికేషన్ పై పదిహేను రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం మూడు కొత్త మండలాలకు గానూ.. ఒక్క నిర్మల్ జిల్లాలోనే రెండు కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. వనపర్తి జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటు చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎనిమిది గ్రామాలతో వనపర్తి జిల్లాలో ఏదుల మండలం ఏర్పాటు కానున్నాయి. ఈ కొత్త మండలాన్ని సింగాయిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, చిన్నారం, చీరకపల్లి, ఏదుల, ముత్తిరెడ్డిపల్లి, రేకుపల్లి తదితర గ్రామాలను కలిపి ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ మంజూరు ఇంకా నిర్మల్ జిల్లాలో కొత్తగా మాలెగావ్, బెల్తారోడా మండలాలుగా ఏర్పాటు కానున్నాయి. మాలేగావ్ నూతన మండలాన్ని అంతర్ని, పంగ్రా, గొడ్సెర, సొనారి, నిఘ్వా, మాలేగావ్, గోదాపూర్, కుప్టి, వర్ని, సన్వాలి, వాయి, లింగి, సౌనా, హంపోలి(బి), మోలా గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇది కూడా చదవండి: Big Breaking: ఈ నెల 16న బీఆర్ఎస్ మేనిఫెస్టో.. శుభవార్తకు సిద్ధం కావాలన్న మంత్రి హరీశ్ రావు ఇంకా.. 12 గ్రామాలతో బెల్తాడోరా మండలాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రైమరీ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ కొత్త మండలం బమిని, బండోరత్, బోస్లా, ఝరి (బుజుర్గ్), ఉమ్రీ (ఖుర్ద్), బోరేగావ్ (ఖుర్ద్), బెంబెర, ఝరి (కే), వాజ్హరి, బోల్తారోడా, భోసి, మహాలింగి తదితర గ్రామాలతో ఏర్పాటు కానుంది. #cm-kcr #telangana-government మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి