Janagama: అయోధ్య యాత్రలో విషాదం..సరయూ నదిలో జనగామ బాలిక గల్లంతు! జనగామ పట్టణానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తన కుటుంబం, బంధువులతో కలసి అయోధ్య యాత్రకు వెళ్లారు.అక్కడ సరయూ నదిలో స్నానం చేస్తున్న క్రమంలో నాగరాజు పెద్ద కుమార్తె తేజశ్రీ (17) నీటి ప్రవాహనికి కొట్టుకుపోయింది. ఎంత వెతికినప్పటికీ ఇప్పటి వరకూ ఆచూకీ లభించలేదు. By Bhavana 31 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Girl Washed Away: ఇద్దరు కుమార్తెలు, బంధువులతో కలిసి అయోధ్యలోని రాముల వారిని దర్శించుకుందామని వెళ్లిన ఆ దంపతులకు తీరని శోకం మిగిలింది. ఓ బిడ్డ సరయూ నదిలో (Sarayu River) గల్లంతవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జనగామ ప్టటణంలోని గీతానగర్ కు చెందిన తాళ్లపల్లి నాగరాజు, ఆయన భార్య జయసుధ, పెద్ద కుమార్తె తేజశ్రీ (17) చిన్న కుమార్తె తరుణి, మరో 8 మంది బంధువులతో కలిసి ఈ నెల 28న హైదరాబాద్ నుంచి విమానంలో అయోధ్య వెళ్లారు. 29 ఉదయం 9 గంటలకూ సరయూ నదిలో స్నానాలు చేయడానికి లక్ష్మణఘాట్ కు చేరుకున్నారు. పెద్ద కుమార్తెతో పాటు ఐదుగురు స్నానం చేస్తుండగా, ఎగువ ప్రాంతమైన నేపాల్ లోని రిజర్వాయర్ నుంచి వరద నీటిని వదలడంతో ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో ఆ ఐదుగురు ప్రవాహంలోకి జారిపోయారు. దీంతో అక్కడే ఉన్న రెస్క్యూ టీమ్ గజ ఈతగాళ్లు నలుగురిని రక్షించగా.. తేజశ్రీ మాత్రం గల్లంతయ్యింది. దీంతో నాగరాజు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం వరకు కూడా తేజశ్రీ ఆచూకీ లభించలేదని నాగరాజు మీడియాకి తెలియాజేశారు. Also Read: మిస్ గ్లోబల్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న కర్ణాటక భామ! #janagama #ayodhya #sarayu-river మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి