రికార్డ్ దిశగా తెలంగాణ పోలింగ్ శాతం..ఎవరికి లాభమో?

సడెన్ గా తెలంగాణలో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరిగింది. ఉదయం నుంచి మందకొడిగా ఉన్న పోలింగ్ ఒక్కసారిగా ఊపు అందుకుంది. ఇప్పటికి తెలంగాణ మొత్తంలో 44 శాతం ఓటింగ్ నమోదయ్యింది.

New Update
రికార్డ్ దిశగా తెలంగాణ పోలింగ్ శాతం..ఎవరికి లాభమో?

Record Voting Percentage in Telangana: తెలంగాణలో ఓటు వెయ్యడానికి జనాలు పోటెత్తుతున్నారు. ఒక్కసారిగా అన్ని జిల్లాల్లో భారీగా పోలింగ్ వాతం నమోదయ్యింది. దీన్ని బట్టి చూస్తే ఈసారి రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ మొత్తం కలిపి 44 శాతం ఓటింగ్ నమోదయ్యింది. దీన్ని బట్టి మొత్తం పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 85 శాతం ఓటింగ్ రిజిస్టర్ అయ్యే ఛాన్స్‌లు కనబడుతున్నాయి. అత్యధికంగా మెదక్ లో 51 శాతం నమోదయితే హైదరాబాద్ లో మాత్రం ఇంకా 20 శాతమే ఉంది.

Also Read:హైదరాబాద్ ఓటర్ల మొద్దు నిద్ర..ఇప్పటికీ కేవలం 13 శాతమే పోలింగ్!

2018లో తెలంగాణ మొత్తం 79.74 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈ సారి అంతకు మించి రావచ్చని తెలుస్తోంది. ఈ పరిణామం ఎవరికి లాభం చేకూరుతుందో అంటూ అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఓటింగ్ సరళిపై అంచనాల్లో అన్ని పార్టీలు మునిగిపోయాయి. ఎవరికి వారే తమకే లాభం అంటూ లెక్కలు వేసేసుకుంటున్నారు.

అన్నింటికంటే తెలంగానలో పల్లెల్లో భారీగా చైతన్యం కనిపిస్తోంది. అక్కడి ప్రజలు ఓట్లు వెయ్యడానికి తరలి వస్తున్నారు. కానీ అర్బన్ లో మాత్రం ఇంకా మందకొడిగానే ఉన్నారు. హైదరాబాద్ లో కూడా పరిస్థితి ఏం మారలేదు.

Also read:మాదే అధికారమంటున్న కేటీఆర్, రాహుల్ గాంధీలు

Advertisment
తాజా కథనాలు