Telangana: తెలంగాణ ప్రభుత్వ విప్‌ల నియామకం.. అందరూ కొత్త ఎమ్మెల్యేలే..! తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా నలుగురు ప్రభుత్వ విప్‌లను నియమించింది. ఎమ్మెల్యేలు రాంచందర్ నాయక్, బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ లను విప్‌లుగా నియమించారు. వీరంతా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే కావడం విశేషం. By Shiva.K 15 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ విప్‌లుగా నలుగురిని నియమించింది. వీరిలో డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లను విప్‌లుగా నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వ పరిపాలనా విభాగం. అయితే, విప్‌లుగా నియమితులైన ఎమ్మెల్యేలంతా కొత్తగా ఎన్నికైన వారే కావడం విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి పరిపాలనల సహా అన్ని అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త ఎమ్మెల్యేలను విప్‌లుగా నియమించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాధత్యలు చేపట్టడంతోనే.. మూడు కమిషనరేట్ల పరిధిలో సీపీలను బదిలీ చేశారు. పాత సీపీల స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించారు. ఆ తరువాత ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రాపాలిని, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా ఐఏఎస్ అధికారి రిజ్వి నియామకం సహా పలు శాఖల ఏఐఎస్ అధికారులను బదిలీ చేశారు సీఎం. అంతేకాదు.. కీలకమైన అంశాలన్నింటిపైనా చాలా ఫాస్ట్‌గా నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. Also Read: అసెంబ్లీని కూలుస్తారా? సీఎం రేవంత్ సంచలన రిప్లై..! 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. #cm-revanth-reddy #telangana-government #telangana-govt-whips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి