Telangana Scooters Scheme: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పథకం అమలుకు అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలో పేర్కొన్నట్లుగా అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. 18 ఏళ్లు నిండి. చదువుకునే అమ్మాయిలకు ఈ పథకం వర్తించనుంది. అయితే, ఈ పథకం అమలు కోసం మార్గదర్శకాలు రూపొందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన అమ్మాయిలు ఎంతమంది ఉంటారనే దానిపై గణాంకాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. అయితే, ఈ పథకం డిస్టేన్స్‌లో చదువుకునే అమ్మాయిల కువర్తించదనే ప్రచారం జరుగుతోంది. రెగ్యులర్‌గా కాలేజీలకు వెళ్లే వారికి మాత్రమే ఈ పథకం వర్తింపజేసేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారే ఈ పథకానికి అర్హులుగా చెబుతున్నారు. పూర్తిగా డ్రైవింగ్ వచ్చిన వారికే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పటికే రాయితీలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం అమలు కోసం అధికారులు విధివిధానాలు రూపొందిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ పథకంపై గైడ్‌లైన్స్ రూపొందించే అవకాశం కనిపిస్తోంది.
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. ఈ మేరకు మేనిఫెస్టోలో కూడా పెట్టింది కాంగ్రెస్. 6 నెలల్లోగా ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. యువ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అనేక పథకాలను మేనిఫెస్టో ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే స్కూటీ పథకం కూడా పేర్కొంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవడంతో.. అమ్మాయిలంతా ఈ పథకం అమలు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఈ పథకం అమలు చేస్తుందా? ఇందుకోసం ఎలాంటి నిబంధనలు విధిస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.
Also Read: