Uttam Kumar Reddy: సీఎం పదవికి పరిశీలనలో నా పేరు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా విజయం సాధించిన తన పేరును సీఎం పదవికి కాంగ్రెస్ హైకమాండ్ తప్పకుండా పరిశీలిస్తుందని ఆశిస్తున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతోందన్నారు.

New Update
Uttam Kumar Reddy: సీఎం పదవికి పరిశీలనలో నా పేరు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

సీఎం పదవికి తాను కూడా రేసులో ఉన్నానని మాజీ పీసీసీ చీఫ్, హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. తాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా.. అది కూడా కాంగ్రెస్ పార్టీలోనే (Congress Party) గెలిచానని గుర్తు చేశారు. 30 ఏళ్లుగా పార్టీలోనే ఉన్నానన్నారు. తనకు ఉన్న శక్తినంతా ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ బలపడడానికి నిరంతరం ప్రయత్నం చేశానన్నారు. రాజకీయాల్లోకి రాకముందు భారత సైన్యంలో పని చేశానని వివరించారు ఉత్తమ్. అక్కడ కూడా తనకు మంచి ట్రాక్ రికార్డు ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Telangana New CM: సీఎం ఫైనల్‌ రేసులో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌.. హైకమాండ్ ఎవరి వైపు?

సీఎం పదవికి తన పేరును కూడా తప్పకుండా పరిశీలిస్తారని ఆశిస్తున్నానన్నారు. పీసీసీ చీఫ్ గా, ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేశానని గుర్తు చేశారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. మిల్ట్రీలో పని చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీలోనూ తాను ఓ క్రమశిక్షణ కలిగిన సైనికుడినేనన్నారు. కాంగ్రెస్ సీఎం ఎంపిక విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్, ఆలస్యం లేదన్నారు ఉత్తమ్.
ఇది కూడా చదవండి: Vijayashanthi-KCR: ‘కేసీఆర్ అన్నా.. ఓడిపోయావా’ విజయశాంతి ట్వీట్ వైరల్!

ఈ విషయంలో తమ పార్టీ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతోందన్నారు. మీడియా, సోషల్ మీడియాలో అనవసరంగా రాంగ్ హైప్ క్రియేట్ చేస్తున్నారన్నారు. ఫలితాలు వచ్చిన 12 గంటల్లోనే సీఎల్పీ మీటింగ్ నిర్వహించామన్నారు. ఫలితాలు విడుదలై 48 గంటలు కూడా కాలేదన్నారు.

#telangana-election-2023 #uttam-kumar-reddy #pcc-chief-revanth-reddy
Advertisment
Advertisment
తాజా కథనాలు