Telangana Elections: తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ(BJP) రాష్ట్ర అధికారి ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి(Rakesh Reddy Anugula) ఆ పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్(వెస్ట్) టికెట్ ఆశించిన రాకేష్ రెడ్డికి బీజేపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. దాంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసినా. గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాకేష్ రెడ్డి. అందుకే తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
పార్టీకి రాజీనామా చేసిన రాకేష్ రెడ్డి.. సంచలన కామెంట్స్ చేశారు. టిక్కెట్ ఇవ్వకపోగా కనీసం ఎవరూ పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పొమ్మనలేక పొగబెట్టారని ఆరోపించారు. బీజేపీలో అన్నీ అవమానాలే ఎదురయ్యాయని అన్నారు. ఎవరు ఎంత అవమానించినా హై కమాండ్‌కు ఏనాడూ ఫిర్యాదు చేయలేదన్నారు. పార్టీకోసం ఎంతో కష్టపడ్డానని, టిక్కెట్ అడగడమే తప్పయిందని రాకేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
2013లో బీజేపీలో చేరిన ఏనుగుల రాకేష్ రెడ్డి.. అనతి కాలంలోనే పార్టీలో ముఖ్య నేతగా ఎదిగారు. తొలుత పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహించిన రాకేష్ రెడ్డి.. ఆ తరువాత కొత్తగూడెం పార్టీ ఇన్‌చార్జిగా నియామకం అయ్యారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ మేరకు ఎప్పటి నుంచో ఆయన ప్రచారం సాగిస్తున్నారు కూడా. ప్రజలకు నిత్యం టచ్‌లో ఉండేవారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌తో నిత్యం పోరాటం సాగించేవారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపేవారు. ఈసారి పార్టీ టికెట్ తనకే అని ఫిక్స్ అయ్యారు రాకేష్ రెడ్డి. కానీ, తాను ఒకటి అనుకుంటే.. బీజేపీ అధిష్టానం మరొకటి ఫిక్స్ చేసింది. వరంగల్ వెస్ట్ స్థానాన్ని రావు పద్మకు కేటాయించారు. దాంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు.
Also Read:
పొలిటికల్ పార్టీలకు గజ్వేల్ వెరీ స్పెషల్.. ఆ సెంటిమెంటే కారణం..!
Telangana: బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా.. జనతా కా మూడ్ సర్వే లెక్కలివే..