/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/KTR-jpg.webp)
Telangana Elections 2023: బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హ్యాట్రిక్ 3.0 లోడింగ్.. సంబరాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి అబ్బాయిలూ అంటూ తాను తుపాకీ ఎక్కుపెట్టిన ఫోటోను శనివారం రాత్రి ట్వీట్ చేశారు. అయితే, ఫలితాలు తారుమారు కావడంతో.. ఈ ట్వీట్‌పై ఆయన స్పందించారు. దీని వయస్సు అయిపోయినట్లుంది. గురి తప్పింది అంటూ ఇవాళ రీట్వీట్ చేశారు.
This one ain’t gonna age well 😁
Missed the mark https://t.co/IUN1vKdTsc
— KTR (@KTRBRS) December 3, 2023
కాంగ్రెస్‌కు కంగ్రాట్స్ చెప్పిన కేటీఆర్..
బీఆర్ఎస్ ఓటమిపై ట్వీట్ చేసిన కేటీఆర్.. తమ ఓటమిని అంగీకరిస్తూ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. రెండుసార్లు తమను గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు కేటీఆర్. ఈ ఫలితాలను చూసి బాధ పడటం లేదన్నారు. అయితే, తాము ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదన్నారు. అందుకే కొత్త నిరుత్సాహపడ్డామన్నారు. దీనిని పాఠంగా తీసుకుని తిరిగి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు కేటీఆర్.
Grateful to the people of Telangana for giving @BRSparty two consecutive terms of Government 🙏
Not saddened over the result today, but surely disappointed as it was not in expected lines for us. But we will take this in our stride as a learning and will bounce back…
— KTR (@KTRBRS) December 3, 2023
Also Read:
‘హ్యాట్రిక్ లోడింగ్’.. కౌంటింగ్‌కు ముందు కేటీఆర్ ఇంట్రస్టింగ్ ట్వీట్..
ISRO: ‘ఆదిత్య ఎల్ 1’లో రికార్డయిన సౌరగాలులు.. సోషల్ మీడియాలో ఇస్రో ఫోటో..