/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/RTV-Interview-jpg.webp)
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని.. మూడో సారి అధికారం తమదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR) ధీమా వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ (Prof Nageshwar Rao) కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కేసీఆర్ (CM KCR) తొమ్మిదేళ్ల పాలనపై విమర్శలు, విజయాలపై నాగేశ్వర్ అడిగిన అనేక ప్రశ్నలకు కేటీఆర్ తనదైన శైలిలో ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది టీఆర్ఎస్, కేసీఆర్ అని.. తమ పోరాటాలతో కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిన పరిస్థితిని తీసుకువచ్చామన్నారు. అన్ని రంగాల్లో తాము అభివృద్ధి చేస్తున్నప్పుడు మార్పు అనే ఆలోచన ప్రజలకు రాదు అని ధీమా వ్యక్తం చేశారు. తాము మంచి ఫ్యామిలీ డాక్టర్ లాంటి వాళ్లమని.. తమను ప్రజలు వదులుకోరన్నారు. కేటీఆర్ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి