Telangana Elections: మరికాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. అభ్యర్థులు వీరేనా?! ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలకు సమయం ఆసన్నమైంది. ఇవాళ సాయంత్రంలోగా సెకండ్ లిస్ట్ విడుదల చేస్తామని సీఈసీ చైర్మన్ మురళీధరన్ తెలిపారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పొంగులేటి, తుమ్మల స్థానాలపైనా క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఇక నిన్న కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్ రెడ్డికి మునుగోడు, రవీందర్ రెడ్డికి బాన్సువాడ స్థానాలను కన్ఫామ్ చేసిందట కాంగ్రెస్. By Shiva.K 27 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Congress MLA Second List: శుక్రవారం సాయంత్రంలోగా తెలంగాణకు(Telangana) సంబంధించి 45 మంది అభ్యర్థులతో రెండవ జాబితాను విడుదల చేస్తామని కాంగ్రెస్ ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తెలిపారు. మిగతా స్థానాలపై నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు(Congress) తీసుకుంటారని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మురళీధరన్.. కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. చెరో రెండు సీట్లు ఇచ్చే విషయంలో అంగీకారం కుదిరిందన్నారు. అయితే, వారికి ఏ స్థానాలు ఇవ్వాలన్న దానిపైనే ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్నారు. ఒకటి రెండు రోజుల్లోనే పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తుందని చెప్పారు మురళీధరన్. అదే సమయంలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట మిత్రపక్షాలకు సీటు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు మురళీధరన్. మాణిక్ రావు ఠాక్రే (Manik rao Thakre) మాట్లాడుతూ.. దాదాపు అన్ని సీట్లపై ఈరోజు జరిగిన సీఈసీ భేటీలో చర్చించామని చెప్పారు. మిగతా సీట్లపై మరోసారి సీఈసీ భేటీ జరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. మిత్రపక్షాలతో చర్చలు జరుగుతున్నాయన్నారు. లెఫ్ట్ పార్టీలతో భట్టి విక్రమార్క, వంశీచంద్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలిపారు మాణిక్ రావు ఠాక్రే. ఒకటిరెండు రోజుల్లో ఈ అంశం కొలిక్కి వస్తుందన్నారు. రెండో జాబితా ఎప్పుడు విడుదల చేయాలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారాయన. ఇక తొలి జాబితాపై చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారని వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. ఫస్ట్ లిస్ట్‌పై ఎవరూ అసంతృప్తిగా లేరని అన్నారు. అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు మాణిక్ రావు ఠాక్రే. ఇదికూడా చదవండి:ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ అభ్యర్థులు వీరేనా?! ☛ కామారెడ్డి: రేవంత్ రెడ్డి ☛ నిజామాబాద్ అర్బన్: షబ్బీర్ అలీ ☛ ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు ☛ పాలేరు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ☛ ఖైరతాబాద్: విజయా రెడ్డి ☛ అంబర్ పేట్: రోహిన్ రెడ్డి ☛ కూకట్ పల్లి: బండి రమేష్ ☛ ఎల్బీనగర్: మధు యాష్కి ☛ తాండూర్: మనోహర్ రెడ్డి ☛ వనపర్తి: మేఘా రెడ్డి ☛ జడ్చర్ల: అనిరుధ్ రెడ్డి ☛ నారాయణపేట: ఎర్ర శేఖర్ ☛ దేవరకొండ: బాలు నాయక్ ☛ భువనగిరి: కుంభం అనిల్ కుమార్ రెడ్డి ☛ సూర్యపేట: పటేల్ రమేష్ రెడ్డి ☛ మునుగోడు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ☛ ఇల్లందు: కోరం కనకయ్య ☛ ఆసిఫాబాద్: శ్యామ్ నాయక్ ☛ ఆదిలాబాద్: కంది శ్రీనివాస్ రెడ్డి ☛ ఖానాపూర్: ఎడమ బొజ్జు ☛ బోథ్: బాబూరావు రాథోడ్ ☛ కరీంనగర్: సంతోష్ కుమార్ ☛ బాన్సువాడ: ఏనుగు రవీందర్ రెడ్డి ☛ హుస్నాబాద్: పొన్నం ప్రభాకర్ ☛ సిరిసిల్ల: కేకే మహేందర్ రెడ్డి ☛ చొప్పదండి: మేడిపల్లి సత్యం ☛ కోరుట్ల: జువ్వాడి నర్సింగ్ రావు ☛ జుక్కల్: లక్ష్మి కాంతారావు ☛ ఎల్లారెడ్డి: మదన్ మోహన్ రావు ☛ వరంగల్ ఈస్ట్: కొండా సురేఖ ☛ మహేశ్వరం: కిచ్చన్నగారి లక్మారెడ్డి ☛ శేరిలింగంపల్లి: జగదీశ్వర్ గౌడ్ ముదిరాజ్ ఓట్లే లక్ష్యంగా ఎన్నికల వ్యూహాలు.. ఇదిలా ఉంటే.. ముదిరాజ్ ఓట్లే లక్ష్యంగా ఎన్నికల వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలకు కాంగ్రెస్ సీట్లు కేటాయించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల పార్టీలో చేరిన నీలం మధుకు పటాన్‌చెరు సీటు దాదాపు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. పటాన్ చెరులో ముదిరాజ్ ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఆ కారణంగానే ఆయనకు సీటు కన్ఫాట్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే గోషామహల్‌లో సునీతారావుకు సీటు ఖరారు చేశారు. మక్తల్‌లో శ్రీహరి ముదిరాజ్, నారాయణపేటలో ఎర్ర శేఖర్ ముదిరాజ్.. రాజేంద్రనగర్‌లో జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు టిక్కెట్లు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదికూడా చదవండి: పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్! #telangana-elections-2023 #congress-mla-list #telangana-congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి