Telangana Elections: మరికాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. అభ్యర్థులు వీరేనా?!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలకు సమయం ఆసన్నమైంది. ఇవాళ సాయంత్రంలోగా సెకండ్ లిస్ట్ విడుదల చేస్తామని సీఈసీ చైర్మన్ మురళీధరన్ తెలిపారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పొంగులేటి, తుమ్మల స్థానాలపైనా క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఇక నిన్న కాంగ్రెస్లో చేరిన రాజగోపాల్ రెడ్డికి మునుగోడు, రవీందర్ రెడ్డికి బాన్సువాడ స్థానాలను కన్ఫామ్ చేసిందట కాంగ్రెస్.