Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్‌పై రగడ.. టికెట్ దక్కని అభ్యర్థుల ఆగ్రహం..

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ తమ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. అయితే, ఈ లిస్టే ఇప్పుడు పార్టీలో కుంపటి రాజేసింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్‌పై మండిపడుతున్నారు. తమకు సీటు దక్కకపోవడానికి రేవంత్ రెడ్డి సహా ఇతర నేతలు అని ఆరోపిస్తూ మీడియా ముందుకు వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్‌పై రగడ.. టికెట్ దక్కని అభ్యర్థుల ఆగ్రహం..
New Update

Telangana Congress Party: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) తమ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. అయితే, ఈ లిస్టే ఇప్పుడు పార్టీలో కుంపటి రాజేసింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్‌పై మండిపడుతున్నారు. తమకు సీటు దక్కకపోవడానికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సహా ఇతర నేతలు అని ఆరోపిస్తూ మీడియా ముందుకు వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేతలైతే గాంధీ భవన్‌లోనే రచ్చ రచ్చ చేశారు.

నీ అంతు చూస్తా రేవంత్ రెడ్డి: హరివర్ధన్ రెడ్డి ఫైర్

పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, రేవంత్ రెడ్డి తనకు న్యాయం చేశాడంటూ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి అంతు చూస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జనరల్‌ సీటులో బీసీకి టికెట్ ఇచ్చారని, ఇక పార్టీ కోసం కష్టపడే ఓపిక తనకు లేదన్నారు. త్వరలోనే తన కార్యాచరణను ప్రకటిస్తానని అన్నారు. ఇదిలాఉంటే.. మేడ్చల్‌లో హరివర్ధన్ రెడ్డి, తోటకూర జంగయ్య యాదవ్ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మేడ్చల్ కాంగ్రెస్ టికెట్ తోటకఊర జంగయ్యకు ఇవ్వడంతో హరివర్ధన్ రెడ్డి వర్గీయులు గొడవకు దిగారు.

మల్లు రవి ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న ముస్లిం మైనారిటీలు..

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్నారు ముస్లిం మైనారిటీలు. ఓల్డ్ సిటీ టికెట్లు పూర్తిగా సంబంధం లేని వ్యక్తులకు కేటాయించారని నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయ చేయాలంటూ గాంధీ భవన్‌లో దిష్టి బొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేశారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమాని ఆత్మహత్యాయత్నం..

ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమాని ఆత్మహత్యాయత్నం చేశారు. పొంగులేటి ఆఫీస్ ముందు అతను ఈ ప్రయత్నం చేశాడు. పొంగులేటి కొత్తగూడెం నుంచే పోటీ చేయాలని డిమాండ్ చేశాడతను. పొంగులేటి వేరే చోటకు వెళ్లొద్దంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన ఇతరులు.. అతన్ని అడ్డుకున్నారు.

నా ఉసురు తగులుతుంది..

రేవంత్ రెడ్డిపై ఉప్పల్ కాంగ్రెస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి నిప్పులు చెరిగారు. రేవంత్ తనకు టికెట్ రాకుండా మోసం చేశాడని బోరున విలపించారు. మధ్యలో కాంగ్రెస్‌లోకి వచ్చి.. పార్టీనే నమ్ముకున్న తమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. తనకు అన్యాయం చేసిన రేవంత్‌కు తన ఉసురు తగులుతుందన్నారు.

రేవంత్ రెడ్డిపై అనుచరుడే ఆగ్రహం..

ఇకపోతే టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిపై ఆయన అనుచరుడే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎస్‌రావు నగర్ కార్పొరేటర్ శిరీష భర్త సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిని నమ్ముకొని మోసపోయానని, రేవంత్ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నాడని ఆరోపించారు. తనలాంటి రేవంత్ బాధితులను కలుపుకుని కొడంగల్‌లో ఆయన్ని ఓడగొట్టిస్తానని శపథం చేశారు. ఉప్పల్‌లో తనకు టికెట్ ఇస్తే తాను గెలుస్తానని అన్ని సర్వేలు చెప్పాయని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది రెండు సీట్లయితే.. అందులో తన భార్య కార్పొరేటర్‌గా గెలిచిందని చెప్పారు. గత తోమిదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేశానని, పార్టీ సచ్చిపోతుంది అనుకున్నప్పుడు పార్టీలో ఎవరు లేరని అన్నారు. తాను రేవంత్ రెడ్డికి సన్నిహితుడినని, ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీతోనే ఉన్నానని చెప్పారు. 2014లో టికెట్ అన్నారు.. ఆ తరువాత 2018లో అన్నారు.. ఇప్పుడు కూడా ఇవ్వలేదని సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సెకండ్ ఆప్షన్‌గా కూడా తన పేరు స్క్రీనింగ్ కమిటీలో పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరమేశ్వర్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డికి లేదని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని రేవంత్ చూస్తున్నాడన్నారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్స్ ఇచ్చి.. పార్టీని నాశనం చేయాలని రేవంత్ చూస్తున్నాడని నిప్పులు చెరిగారు. టీడీపీ మాదిరిగా పార్టీని నాశనం చేసి ప్రాంతీయ పార్టీ స్థాపించాలని రేవంత్ చూస్తున్నాడన్నారు సింగిరెడ్డి. సీఎం పదవి కోసం ప్రైవేట్ ఆర్మీని రేవంత్ నిర్మించుకున్నాడని, రేవంత్ రెడ్డికి అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అమ్మేస్తాడన్నారు. రేవంత్ రెడ్డిని కొడంగల్లో తంతే మల్కాజిగిరిలో మేము గెలిపించుకున్నామన్నారు. రేవంత్ రెడ్డికి అహంకారం వచ్చిందని, రేవంత్ బాధితులంతా తనతో రావాలని, అందరి తరఫున తాను కొట్లాడుతానని చెప్పారు. కొడంగల్‌లో రేవంత్ ఓటమికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. 300 మంది రేవంత్ బాధితులు ఉన్నారని, తమతో వందల కోట్లు ఖర్చు చేపించాడని ఆరోపించారు సింగిరెడ్డి. ఇన్ని రోజులు రేవంత్ కోసం పని చేశానని.. రేపటి నుంచి రేవంత్ కు వ్యతిరేకంగా పని చేస్తానని అన్నారు. రేవంత్ రెడ్డికు హటావో.. కాంగ్రెస్ కు బచావో అని నినదించారు. కాళ్లకు గజ్జెలు కట్టుకుని అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతాని, రేవంత్ ని ఓడగొడుతానని ప్రకటించారు. తన నియోజకవర్గానికి పోవాలంటే సిగ్గుగా ఉందన్నారు. 15రోజుల నుంచి ఢిల్లీలో దాకున్నానన్నారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులను పక్కన పెడితే BRSని ఎలా ఎదిరిస్తారని ప్రశ్నించారు సింగిరెడ్డి. ఉప్పల్లో పార్టీ ఖాళీ అవుతుందని, నియోజకవర్గ ప్రజల మంచి కోసం ఏ పార్టీ హామీ ఇస్తే ఆ పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు సింగిరెడ్డి.

Also Read:

CM KCR Live: మళ్లీ అధికారం మనదే.. ఆ విషయంలో అలర్ట్ గా ఉండండి: అభ్యర్థులతో కేసీఆర్

చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ తీరు అమానవీయం..పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

#telangana-congress #revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe