KCR: చిప్పకూడు తిన్నా సిగ్గు రాలే.. నీతి లేనోడు: రేవంత్ రెడ్డిపై కేసీఆర్ స్ట్రెయిట్ అటాక్

ఓటుకు నోటు కేసులో లంచం ఇస్తూ అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ రోజు కొడంగల్ లో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల మీటింగ్ లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్ రెడ్డికి ఓటు వేస్తే సేవ చేసే నరేందర్ రెడ్డిని కోల్పోతారని అన్నారు.

ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్: కేసీఆర్
New Update

ఈ రోజు కొడంగల్ లో పర్యటించిన సీఎం కేసీఆర్ (CM KCR) పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. అందరినీ తిట్టడం తప్పా.. ఆయన కొడంగల్ నియోజకవర్గానికి చేసేందేమీ లేదంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటలే కరెంట్ చాలంటున్నాడని ధ్వజమెత్తారు. 24 గంటల కరెంట్ ఉండాలంటే కొడంగల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలవాలన్నారు. రైతులు 10 HP మోటార్లు పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి అంటున్నాడన్నారు. ఈ విషయాన్ని రైతులు ఆలోచన చేయాలని కోరారు. వ్యవసాయం చేసే రైతులు ఇలా మాట్లాడరన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా దున్నినోడా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: TS Elections: మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే… ఖర్గే చురకలు!

ఆయన ఓ పెద్ద భూకబ్జాదారుడని ఆరోపించారు కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను తీసేసి బంగాళాఖాతంలో వేస్తారట.. అంటూ ఫైర్ అయ్యారు. అలా చేస్తే మళ్లీ వీఆర్వోలు వస్తారన్నారు. ధరణిని తీసేస్తే పైరవీకారులు వస్తారని హెచ్చరించారు. ఒకరి భూమి మరొకరికి రాసే ప్రమాదం ఉంటుందన్నారు. నిజాయితీతో ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లను కేసీఆర్ కోరారు. 9 ఏళ్లల్లో రేవంత్ రెడ్డి వాళ్లు, వీళ్లను తిట్టడం తప్పించి నియోజకవర్గంలో ఒక్క పని కూడా చేయలేదని ఫైర్ అన్నారు. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడని ఆ పార్టీ నేతలే చెబుతున్నారన్నారు.
ఇది కూడా చదవండి: Gulabeela Jendalamma Song: హరీశ్‌రావు నోట రామక్క పాట.. కాంగ్రెసోళ్లు నకలు కొట్టారంటూ సెటైర్లు..

తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రైఫిల్ తో ఉద్యకారులపైకి వెళ్లాడన్నారు. రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి రూ.50 లక్షలు లంచం ఇస్తూ దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ ఆరోపించారు.  చిప్ప కూడు తిన్నా ఆయనకు ఇంకా.. సిగ్గురాలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు.. మన్ను కాడన్నారు.

నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ఆయన స్థాయి పెరుగుతుందన్నారు. ఆ ఫాల్తు రేవంత్ రెడ్డి ఇచ్చే మందు సీసాలకు మోసపోవద్దన్నారు. రేవంత్ రెడ్డికి ఓ నీతి లేదు, ఓ పద్ధతి లేదు, ఓ నియమం లేదన్నారు. ఎన్నడూ రేవంత్ రెడ్డి పేరు ఎత్తడానికి పెద్దగా ఆసక్తి చూపని సీఎం కేసీఆర్.. ఈ రోజు ఆయన పేరును ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం రాజకీయ వార్గాల్లో ఆసక్తిగా మారింది.

#cm-kcr #telangana-elections-2023 #pcc-chief-revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe