బీఆర్ఎస్.. భ్రష్టాచార్ సర్కార్: సూర్యాపేట సభలో మాయావతి ఫైర్ తెలంగాణలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవని.. భ్రష్టాచార్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని ఆమె పిలుపునిచ్చారు. By Nikhil 22 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి కాంగ్రెస్ అంబేద్కర్ ను అవమానించిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ రోజు బీఎస్పీ నిర్వహించిన భహిరంగ సభకు మాయావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ కోటా ఉండాలని.. మొదటి నుంచి బీఎస్పీ ఈ విషయం చెప్తోందన్నారు. ఇక, తెలంగాణలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవని.. భ్రష్టాచార్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణలో రాబోయేది బిఎస్పీ సర్కారేనన్నారు. సబ్బండవర్గాలకు అండగా ఉండేది బీఎస్పీ పార్టీనే అని.. ఈ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఎస్పీ గెలిస్తే.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారని మాయావతి చెప్పారు. Why did RSP enter politics? @NtvTeluguLive pic.twitter.com/BJYINR0mxO— BSP Telangana & Andhra Pradesh (@bsp_ts) November 22, 2023 #telangana-elections-2023 #rs-praveen-kumar #mayavathi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి