Telangana: 54 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్‌లు.. కేటీఆర్, హరీష్, కవిత ఏ నియోజకవర్గాలకంటే..

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఫుల్ బిజీ అయిపోయాయి. ప్రచార పర్వం మొదలుపెట్టనున్నాయి. ఈ విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీఒక అడుగు ముందే ఉందని చెప్పొచ్చు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిల తొలి విడత జాబితాను విడుదల చేసింది. 54 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది.

భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ అసంతృప్తి నేతల మంతనాలు
New Update

BRS Assembly Incharges: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఫుల్ బిజీ అయిపోయాయి. ప్రచార పర్వం మొదలుపెట్టనున్నాయి. ఈ విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ(BRS) ఒక అడుగు ముందే ఉందని చెప్పొచ్చు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిల తొలి విడత జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలుంటే.. మొత్తం 54 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీరిని నియమించారు. కాగా, ఈ ఇన్‌చార్జిలలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. వీరికి ఒక్కో నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు.

అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జిలు వీరే..

1. బెల్లంప‌ల్లి – ఎంపీ వెంక‌టేశ్ నేత‌

2. మంచిర్యాల – ఎమ్మెల్సీ భానుప్రసాద్

3. ఖానాపూర్ – ఎమ్మెల్సీ దండె విఠ‌ల్

4. బోథ్ – మాజీ ఎంపీ న‌గేశ్

5. ముదోల్ – మాజీ ఎమ్మెల్సీ పురాణం స‌తీశ్ కుమార్

6. బోధ‌న్ – ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత‌

7. ఎల్లారెడ్డి – మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధ‌ర్ గౌడ్

8. కామారెడ్డి – ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మంత్రి కేటీఆర్

9. నిజామాబాద్ అర్బన్ – ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత‌

10. జ‌గిత్యాల – ఎమ్మెల్సీ ర‌మ‌ణ‌, మాజీ మంత్రి రాజేశం గౌడ్

11. రామ‌గుండం – మాజీ ఎమ్మెల్సీ నార‌దాసు ల‌క్ష్మణ్‌

12. మంథ‌ని – ఈద శంక‌ర్ రెడ్డి

13. పెద్దప‌ల్లి – ర‌వీంద‌ర్ సింగ్

14. చొప్పదండి – మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్

15. వేముల‌వాడ – మాజీ ఎంపీ వినోద్ కుమార్

16. మాన‌కొండూరు – సుడా చైర్మన్ జీవీ రామ‌కృష్ణ‌

17. మెద‌క్ – కే తిరుప‌తి రెడ్డి

18. ఆందోల్ – మాజీ ఎమ్మెల్సీ ఫ‌రూఖ్ హుస్సేన్

19. న‌ర్సాపూర్ – ఎమ్మెల్సీ వెంక‌ట‌రాం రెడ్డి

20. జ‌హీరాబాద్ – మాజీ ఎమ్మెల్సీ దేవీ ప్రసాద్

21. సంగారెడ్డి – వీ భూపాల్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్

22. దుబ్బాక – బాల‌మ‌ల్లు

23. గ‌జ్వేల్ – మంత్రి హ‌రీశ్ రావు, ఎమ్మెల్సీ యాద‌వ రెడ్డి, ప్రతాప్ రెడ్డి

24. మ‌ల్కాజ్‌గిరి – ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

25. ఉప్పల్ – రావుల శ్రీధ‌ర్ రెడ్డి

26. ఇబ్రహీంప‌ట్నం – మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణా రెడ్డి

27. చేవెళ్ల – ఎంపీ రంజిత్ రెడ్డి

28. వికారాబాద్ – ఎంపీ రంజిత్ రెడ్డి

29. ముషీరాబాద్ – ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాక‌ర్

30. అంబ‌ర్‌పేట్ – క‌ట్టెల శ్రీనివాస్ యాద‌వ్, అడ్వకేట్ మోహ‌న్ రావు

31. సికింద్రాబాద్ కంటోన్మెంట్ – మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్

32. మ‌క్తల్ – ఆంజ‌నేయులు గౌడ్

33. గ‌ద్వాల్ – మాజీ చైర్మన్ రాకేశ్ చిరుమ‌ళ్ల‌

34. అలంపూర్ – ఎమ్మెల్సీ చ‌ల్లా వెంక‌ట్రామ్ రెడ్డి

35. అచ్చంపేట – ఇంతియాజ్ ఇషాక్

36. క‌ల్వకుర్తి – గోలి శ్రీనివాస్ రెడ్డి

37. కొల్లాపూర్ – ఎంపీ రాములు

38. నాగార్జున సాగ‌ర్ – ఎమ్మెల్సీ కోటి రెడ్డి, రామ‌చంద్ర నాయ‌క్

39. హుజుర్ న‌గ‌ర్ – విజ‌య‌సింహా రెడ్డి

40. కోదాడ – ఎమ్మెల్సీ టీ ర‌వీంద‌ర్ రావు

41. న‌ల్లగొండ – జ‌డ్పీ చైర్మన్ బండా న‌రేంద‌ర్ రెడ్డి

42. న‌కిరేక‌ల్ – ఎంపీ బడుగుల లింగ‌య్య యాద‌వ్

43. జ‌న‌గామ – మాజీ ఎమ్మెల్సీ బీ వెంక‌టేశ్వర్లు, రాజ‌య్య, మంత్రి హ‌రీశ్‌రావు

44. మ‌హ‌బూబాబాద్ – మంత్రి స‌త్యవ‌తి రాథోడ్

45. న‌ర్సంపేట – వీ ప్రకాశ్

46. వ‌రంగ‌ల్ ఈస్ట్ – మండ‌లి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్

47. భూపాల‌ప‌ల్లి – ఎమ్మెల్సీ బ‌స‌వ‌రాజు సార‌య్య

48. ములుగు – ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి

49. ఇల్లందు – ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర

50. మ‌ధిర – మంత్రి పువ్వాడ అజ‌య్, కొండ‌బాల కోటేశ్వర్ రావు

51. వైరా – ఎంపీ నామా నాగేశ్వర్ రావు

52. స‌త్తుప‌ల్లి – ఎంపీ పార్థసార‌థి రెడ్డి

53. అశ్వరావుపేట – శేష‌గిరావు(ఖ‌మ్మం డీసీఎంఎస్)

54. భ‌ద్రాచ‌లం – ఎమ్మెల్సీ తాత మ‌ధు

అయితే, ఈ 54 నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించడానికి ప్రత్యేక కారణం ఉందని టాక్ నడుస్తోంది. ఈ సీట్లలో కాస్త పోటీ ఉండనుంది, ఇక్కడ పార్టీ ప్రతినిథులను ఎక్కువ మోహరించి గట్టి ప్రచారం చేస్తే గెలుపు ఈజీ అని గులాబీ బాస్ భావిస్తున్నారట. ఈ సీట్లలో గెలిస్తే.. మిగతా చోట్ల పెద్ద ఇబ్బంది ఉండదని, అవి, ఇవి కలిపితే అధికారం మళ్లీ బీఆర్ఎస్‌దే అని లెక్కలేసుకుంటున్నారు. ఇక సీఎం కేసీఆర్ దాదాపు 100 కు పైగా నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దాంతో ఆయన పోటీ చేయనున్న నియోజకవర్గాల్లో ప్రచారం చేయలేని పరిస్థితి ఉంది. అందుకే తాను పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలకు కూడా ఇన్‌చార్జ్‌లను నియమించారు. గజ్వేల్ ఇన్‌చార్జ్‌లుగా మంత్రి హ‌రీశ్ రావు, ఎమ్మెల్సీ యాద‌వ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, కామారెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మంత్రి కేటీఆర్‌లకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. ఇక బీజేపీ బలంగా నిలుస్తున్న నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ కవితను ఇన్‌ఛార్జిగా నియమించారు. మిగతా స్థానాల్లో ఢోకా ఉండదని, ఈ స్థానాల్లో గెలిస్తే.. అధికారం బీఆర్ఎస్‌దే పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.

ఇదికూడా చదవండి: భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్…ఆసుపత్రులలో బెడ్స్ బుకింగ్

ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా నియమితులైన వారికి ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. శుక్రవారం నాడుు టెలికాన్ఫరెన్స్‌ సమావేశంలో వారికి కీలక సూచనలు, సలహాలు చేశారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు అనుకూల పరిస్థితి ఉందని, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్ధానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత పది సంవత్సరాలలో చేసిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లి.. ప్రజలను ఓట్లు అడగాలని నేతలకు సూచించారు. గత పది సంవత్సరాలుగా బిఅర్ఎస్ పార్టీ పాలనలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం కావాలని పార్టీ నాయకులకు సూచించారు.

ఇదికూడా చదవండి: Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడి తెరంగేట్రంపై రేణు దేశాయ్ ఎమన్నారంటే..?

#telangana #telangana-elections-2023 #brs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe