/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/MLA-Raja-Singh-jpg.webp)
BJP revokes suspension of MLA Raja Singh: బీజేపీ అధిష్టాన సంచలన నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్‌పై (MLA Raja Singh) విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మరో 40 రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections 2023) జరుగనున్న నేపథ్యంలో బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను రెడీ చేసింది. ఈ తొలి జాబితాలో గోషామహల్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ పేరును కూడా ఖారారు చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్‌పై గతంలో పార్టీ విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
ఆ వ్యాఖ్యల కారణంగానే..
కాగా, గతేడాది ఆగష్టులో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ (BJP) హైకమాండ్ స్పెండ్ చేసింది. మహ్మద్ ప్రవక్తపై ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ ముస్లిం దేశాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటుగా.. బీజేపీ శాసన సభా పక్ష నేత పదవి నుంచి కూడా తొలగించింది. ఇక రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై పలు ప్రాంతాల్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. వాస్తవానికి ఈ వివాదం.. మునవ్వర్ ఫారుఖీ కామెడీ షో కారణంగా తలెత్తింది. మునవ్వర్ ఫారుఖీ కామెడీ షోను హైదరాబాద్‌లో నిర్వహించకూడదంటూ రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ క్రమంలో ఆయన ఒక వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో మైనార్టీ వర్గాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీడియో వైరల్ అవడంతో.. ఆయనపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకుంది.
కృతజ్ఞతలు తెలిపిన రాజాసింగ్..
తనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్, కిషన్ రెడ్డికి, లక్ష్మణ్, బండి సంజయ్, మురళీధర్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు రాజాసింగ్. బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే రాజాసింగ్.
Also Read:
Batukamma:గౌరమ్మను తల్లి గంగమ్మ ఒడిలో వదిలేసే సద్దుల బతుకమ్మ
Women Health: మహిళలూ బీ అలర్ట్.. ఈ 7 లక్షణాలు అస్సలు విస్మరించొద్దు..