Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ బీసీ జపం.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?!

తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో అధికశాతం ఓటు బ్యాంకు ఉన్న బీసీలను తమవైపు లాగేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే.. ఆ పార్టీ విడుదల చేసిన మొదటి లిస్ట్ లో బీసీలకే అధికంగా టిక్కెట్లు కేటాయించింది. మొత్తం విడుదల చేసిన 52 మంది అభ్యర్థుల లిస్ట్ లో 19 మంది బీసీలు ఉన్నారు. దీన్ని బట్టి తెలంగాణలో బీజేపీ బీసీ కార్డ్ ను ప్రయోగిస్తుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

New Update
Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ బీసీ జపం.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?!

BJP BC Strategy in Telangana Election: తెలంగాణలో అసలైన పోరు ఇగ షురూ కానుంది. ఇప్పటి వరకూ ప్రచారం పర్వం వన్ సైడ్ జరుగగా.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు కూడా ఖరారు కావడంతో తెలంగాణ(Telangana) రాజకీయం మరింత రసవత్తరంగా సాగనుంది. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులందరినీ ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండగా.. కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికీ ఫస్ట్‌ లిస్ట్‌తోనే సరిపెట్టాయి. కాంగ్రెస్ 55, బీజేపీ 52 మంది అభ్యర్థుల చొప్పున ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసింది. అయితే, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యానికి కారణం పొలిటికల్ స్ట్రాటజీనే అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు.. తెలంగాణలో అధిక ఓటు బ్యాంకు కలిగిన బీసీలను తమవైపు లాగేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ చాలా ఫోకస్డ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. తాజాగా బీజేపీ విడుదల చేసిన తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తాజాగా విడుదల తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థులుగా 52 మంది పేర్లు ప్రకటించింది. ఈ లిస్ట్‌లో ఎక్కువగా బీసీలకే 19 సీట్లు కేటాయించింది. ఆ తరువాత స్థానంలో రెడ్డిలు ఉన్నారు. రెడ్డి లకు బీజేపీ 12 స్థానాలు కేటాయించింది. ఇక ఎస్సీలకు 8, ఎస్టీలకు 6, వెలమలకు 5, వైశ్య 1, రాజాసింగ్ 1 చొప్పున కేటాయించారు. ఈ లిస్ట్‌ను బట్టి బీసీలకు బీజేపీ ఎంతటి ప్రాధాన్యత ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ మొదటి విడతలో మొత్తం 12 మంది మహిళలకు అవకాశం కల్పించింది.

Also Read:

Andhra Pradesh: ఇలా చేస్తే చంద్రబాబుకు ఈజీగా బెయిల్‌ వచ్చేది.. ఉండవల్లి అరుణ్ సంచలన కామెంట్స్..

MLA Raja Singh: బీజేపీ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత..

Advertisment
తాజా కథనాలు