Telangana: మీరు అలా చేయడంతోనే ఉన్న పదవి పోయింది.. కార్యకర్తలతో బండి సంజయ్..

జిన్నారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్.. సీఎం సీఎం అంటూ అభిమానులు చేసిన నినాదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ నినాదాలు చేయడం వల్లే ఉన్న పోస్టు ఊడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ ని తొలగించిన విషయం తెలిసిందే.

New Update
Bandi Sanjay: బీజేపీలోకి హరీష్‌ రావు.. ఆయనొక్కడే మంచోడంటూ బండి కీలక వ్యాఖ్యలు!

Bandi Sanjay Kumar: జన్నారం బీజేపీ సింహగర్జన సభలో ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. సీఎం నినాదలతోనే ఉన్న పోస్ట్ పోయిందని వ్యాఖ్యానించారు. మరి బండి సంజయ్ అలా ఎందుకు అన్నారు? అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఎంపీ బండి సంజయ్.. తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన సాగిస్తున్నారు. బీజేపీ నిర్వహిస్తున్న అన్ని బహిరంగ సభల్లో పాల్గొంటూ.. ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే.. గురువారం నాడు మంచిర్యాల జిల్లాలోని జన్నారంలో బీజేపీ ఆధ్వర్యంలో సింహగర్జన సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన ఎంపీ బండి సంజయ్ కుమార్.. ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అయితే, సభా ప్రాంగణంపై ప్రసంగిస్తుండగా.. అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నినాదాలపై బండి సంజయ్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. సీఎం సీఎం అనే నినాదాలతోనే ఉన్న పోస్ట్ పోయిందని వ్యాఖ్యానించారు.


ఇదే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు ఎంపీ బండి సంజయ్ కుమార్. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. అభివృద్ధికి ప్రజలంతా బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. బీఆర్ఎస్‌లోకి వెళ్తారని, అందుకే ఆ రెండు పార్టీలకు కాకుండా బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు బండి సంజయ్. కేంద్రంలో వచ్చేది బీజేపీనే అన్న ఆయన.. రాష్ట్రంలోనూ బీజేపీ వస్తే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోవడం ఖాయం అని అన్నారు. డిసెంబర్ 3వ తేదీ తరువాత కేసీఆర్ మాజీ సీఎం కావడం ఖాయం అని అన్నారు.

Also Read:

మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. అదిరిపోయే పథకాలు..

కేసీఆర్‌కు సొంత కారు కూడా లేదు.. ఆస్తుల వివరాలు చూస్తే షాకే..!

Advertisment
తాజా కథనాలు