YS Sharmila: షర్మిల బిగ్ ట్విస్ట్.. పొంగులేటి సూచనతో అక్కడి నుంచి పోటీకి సై?

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనతో కొత్తగూడెం నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అక్కడ పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ కాకుండా సీపీఐ పోటీ చేస్తుండడంతో.. హస్తం పార్టీ ఓటు బ్యాంకు అంతా తన వైపు కన్వర్ట్ అవుతుందని షర్మిల స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.

New Update
YS Sharmila: షర్మిల బిగ్ ట్విస్ట్.. పొంగులేటి సూచనతో అక్కడి నుంచి పోటీకి సై?

ఎలాగైనా పాలేరు నుంచే పోటీ చేస్తానంటూ ప్రకటిస్తూ వస్తున్న వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల (YS Sharmila) మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) మంత్రాంగమే ఇందుకు కారణమని సమాచారం. వైఎస్సార్ ఫ్యామిలీతో పొంగులేటికి మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన 2014లో ఖమ్మం ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ఎస్ లో చేరినా.. వైఎస్ ఫ్యామిలీకి మాత్రం ఆయన దూరం కాలేదు. ఈ నేపథ్యంలోనే తాను పాలేరు నుంచి పోటీకి దిగుతున్న నేపథ్యంలో కొత్తగూడం నుంచి పోటీ చేయాలని షర్మిలను పొంగులేటి కోరినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TS Elections 2023: తెలంగాణలో ఆ పార్టీదే గెలుపు.. మిషన్ చాణక్య సంచలన సర్వే.. వివరాలివే!

ఇందుకు ఆమె కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. కొత్తగూడెం నుంచి పోటీ చేస్తే తాను అన్ని విధాలుగా సహకారంగా ఉంటానని పొంగులేటి హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాలేరులో పొంగులేటికి మద్దతుగా వైఎస్ షర్మిల కేడర్ విస్తృతంగా ప్రచారం కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్.. సీపీఐకి కేటాయించే అవకాశం ఉండటంతో షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాను కొత్తగూడెంలో పోటీ చేస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా సీపీఐకి కాకుండా తనకు కలిసివస్తుందని ఆమె అంచనా వేస్తున్నారు.

మరోవైపు స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వర రావు కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఉండడం, ఆయనకు గట్టి ప్రత్యర్థి లేకపోవడం తనకు ప్లస్ అవుతుందని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగూడెం నుంచి పోటీ చేస్తే తాను అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని ఆమె ధీమాగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో షర్మిల కొత్తగూడెంలో పోటీ చేసే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు