Telangana Elections - Wines Closed: మద్యం ప్రియులకు ముఖ్య గమనిక. తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరుగుతుండడంతో మద్యం షాపులకు కీలక ఆదేశాలు ఇచ్చింది ఈసీ. ఈ నెల 28, 29, 30 తేదిల్లో అన్నీ మద్యం షాపులు బంద్ (Wines Closed) చేయాలని ఆదేశించింది. ఒకవేళ ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ALSO READ: పెన్షన్ రూ.5000.. కేసీఆర్ సంచలన ప్రకటన!
తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మూతపడనున్నాయి. ఈ మేరకు సీపీ డీఎస్ చౌహాన్ నోటిఫికేషన్ జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ ను సీపీ విధించారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఐదుగురి కంటే ఎక్కువ గుమికూడొద్దని సీపీ చౌహాన్ ఆదేశించారు.
ALSO READ: BREAKING: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్!