తెలంగాణలో శాననసభ ఎన్నికలకు (Telangana Assembly Elections) ముహూర్తం దగ్గర పడింది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే నెల 6వ తేదీన షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని మీడియా కథనాలు వస్తున్నాయి. మరో వైపు.. ఎలక్షన్ కమిషన్ ఓటరు నమోదు, జాబితా తయారీపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 18వ తేదీ వరకు కొత్తగా ఓటు హక్కు కోసం మొత్తం 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అయితే.. గతేడాది భారీగా ఓట్లు గల్లంతు కావడంతో ఆయా ఓటర్ల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అయ్యింది. చివరి నిమిషంలో తమ ఓటు లేదని తెలిస్తే ఏం చేయాలని వారంతా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్లు ముందుగా తమ ఓటు చెక్ చేసుకోవడం బెటర్ అని అధికారులు సూచిస్తున్నారు. ఇందు కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొనే ఓటు చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎన్నికల కమిషన్. మీరు మీ ఓటు ఉందా? లేదా? అన్న విషయాన్ని మీ ల్యాట్ ట్యాప్ లేదా స్మార్ట్ ఫోన్ లో క్షణాల్లో చెక్ చేసుకోవచ్చు.
ఓటర్ లిస్ట్ లో మీ పేరును చెక్ చేసుకోవడానికి ఈ సింపుల్ స్టెప్స్..
1. ముందుగా ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://ceotelangana.nic.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
2. అనంతరం హోం పేజీలో కనిపించే Search Your Name విభాగంలో Search Your Name---> VOTERS SERVICE PORTAL ఆప్షన్ ను ఎంచుకోండి.
3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, జిల్లా, నియోజకవర్గం నమోదు చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి.
దీంతో ఈ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
4. మీ వద్ద ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే.. EPIC Number ను నమోదు చేయడం ద్వారా కూడా మీ ఓటు వివరాలను చెక్ చేసుకోవచ్చు.
5. మీ ఫోన్ నంబర్, ఓటీపీ ద్వారా కూడా మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందో? లేదో? అన్నది తెలుసుకోవచ్చు.