Vijayashanthi-KCR: 'కేసీఆర్ అన్నా.. ఓడిపోయావా' విజయశాంతి ట్వీట్ వైరల్!

'నేను అన్నా అని పిలిచి, గౌరవంతో కలిసి పనిచేసిన కేసీఆర్ గారు తానే స్వయంగా ఎమ్మెల్యేగా కూడా ఓటమి పొందిన స్థితికి తెలంగాణ ల బీఆర్ఎస్ పార్టీ ని ఇయ్యాల తెచ్చుకోవడం బాధాకరం'.. అంటూ విజయశాంతి చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

New Update
Vijayashanthi-KCR: 'కేసీఆర్ అన్నా.. ఓడిపోయావా' విజయశాంతి ట్వీట్ వైరల్!

Vijayashanthi Tweet on KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై (KCR) కాంగ్రెస్ నేత విజయశాంతి (Vijayashanthi) చేసిన ట్వీట్‌ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ కోసం కొట్లాడినప్పటి నుంచి విధానపరంగా విబేధాలున్నా.. తాను అన్నా అని పిలిచిన కేసీఆర్‌ స్వయంగా ఓడిపోవడం బాధాకరమని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత, లేదా 2018 తర్వాత కేసీఆర్ పదవికి దూరంగా ఉంటే.. ఈ రోజు ఈ పరిణామాలు ఉండేవి కావన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రతిపక్ష హోదాలో హుందాగా వ్యవహరిస్తుందని తెలంగాణ సమాజం ఎదురు చూస్తోందన్నారు.
ఇది కూడా చదవండి:Big Breaking: తెలంగాణ కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలు వీరే?

ఆమె ట్వీట్.. ''ఇద్దరే ఎంపీలుగా తెలంగాణకై కొట్లాడిన నాటినుండి మా మధ్య విధానపరంగా అనేక వ్యతిరేకతలు ఉన్నా, నేను అన్నా అని పిలిచి, గౌరవంతో కలిసి పనిచేసిన కేసీఆర్ గారు తానే స్వయంగా ఎమ్మెల్యేగా కూడా ఓటమి పొందిన స్థితికి తెలంగాణ ల బీఆర్ఎస్ పార్టీ ని ఇయ్యాల తెచ్చుకోవడం బాధాకరం.

మొదట కేసిఆర్ గారు ఎన్నో పర్యాయాలు చెప్పినట్లుగా తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, కాదంటే 2018 ఎన్నికల తర్వాత కావచ్చు, పదవికి దూరంగా ఉంటే ఇయ్యాల్టి ఈ పరిణామాలు వారికి ఉండక పోయి ఉండవచ్చు..

ఏదిఏమైనా ఏర్పడనున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల గౌరవంతోకూడిన ప్రతిపక్ష హుందాతనాన్ని
కేసీఆర్ గారు, బీఆర్ఎస్ నుండి తెలంగాణ సమాజం
ఎదురుచూస్తున్నది..

హర హర మహాదేవ

జై తెలంగాణ

జై హింద్

విజయశాంతి''

Advertisment
తాజా కథనాలు