TS School Holidays: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఎన్నికల నేపథ్యంలో వరుస సెలవులు.. డేట్స్ ఇవే!

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. నవంబర్ 29,30తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు సెలవును ప్రకటించనుంది సర్కార్.

New Update
JNVST Hall Tickets: విద్యార్థులకు అలర్ట్...జవహర్ నవోదయలో 6వ తరగతి పరీక్ష హాల్ టికెట్లు రిలీజ్..ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..!!

తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. నవంబర్ 29, 30వ తేదీల్లో పాఠశాలకు సెలవు ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30 వ తేదీని ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈరోజు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈరోజుతోపాటు ముందు రోజు కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ డ్యూటీలో మొత్తం 80శాతం మంది ఉపాధ్యాయులు పాల్గొననున్నారు.

ఎన్నికల అధికారులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. వీరిలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అనే చెప్పవచ్చు. ఈ నెల 30 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలోని ఉపాధ్యాయుల్లో సుమారు 80 శాతం మంది విధుల్లో పాల్గొంటారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పోలింగ్‌ తేది నవంబర్‌ 30, దాని ముందురోజు నవంబర్‌ 29 న రెండు రోజులు కూడా ప్రభుత్వ పాఠశాలకు ప్రకటించనుంది.

ఎన్నికల సంఘం సూచన మేరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే టీచర్స్‌ నవంబర్‌ 29 నే ఈవీఎం యంత్రాలు తీసుకునేందుకు రెడీగా ఉన్నామంటూ అధికారులకు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. పోలింగ్‌కు ముందు రోజే మధ్యాహ్నానికే పోలీంగ్‌ కేంద్రాలు అయినటువంటి పాఠశాలలకు ఉపాధ్యాయులు చేరుకోవాల్సి ఉంటుంది.

ఎన్నికలు పూర్తయ్యి ఈవీఎంలను ఎన్నికల అధికారులకు సమర్పించి మొత్తం పూర్తి చేసే సరికి ఎన్నికల రోజు అర్థరాత్రి దాటుతుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ మేరకు రెండు రోజులు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ వర్గాలు అనుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే ఎన్నికల తరువాత రోజు కూడా ఉపాధ్యాయులకు అంటే డిసెంబర్‌ 1న కూడా సెలవు ఇవ్వాలనే డిమాండ్‌ మొదటి నుంచి కూడా వినిపిస్తోంది.దీని గురించి ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్‌, తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌  రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు కోరారు.

ఇది కూడా చదవండి: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు 22 స్పెషల్ ట్రైన్స్.. డేట్స్, టైమింగ్స్ ఇవే..!!

Advertisment
తాజా కథనాలు