Sharmila vs KCR: కేసీఆర్‌ తెలంగాణ ద్రోహి.. 'ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నాడు'- షర్మిల!

ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా మిగిలిన పార్టీల వారిని తెలంగాణ ద్రోహులని కేసీఆర్‌ నిందిస్తున్నారని..ఇదేం లాజికో తనకు అర్థంకావడం లేదన్నారు YSRTP చీఫ్‌ షర్మిల. కేసీఆర్‌కు గట్స్‌ ఉంటే.. దమ్ముంటే.. ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు.

New Update
YS Sharmila: కేసీఆర్ పాలనను బొంద పెట్టాలె.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YSRTP చీఫ్‌ షర్మిల ఫుల్‌ ఫైర్ మీదున్నారు. ఛాన్స్‌ దొరికితే చాలు సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. ఇంగ్లిష్‌ మీడియాకైనా.. తెలుగు మీడియాకైనా..ఎలాంట ఇంటర్వ్యూ ఇచ్చినా.. ఓ చిన్న బైట్ ఇచ్చినా.. కాంక్లెవ్‌లో పాల్గొన్నా.. షర్మిల టార్గెట్‌ మాత్రం కేసీఆరే. అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పోటి చేయడం లేదన్న విషయం తెలిసిందే. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్‌కు సపోర్ట్‌గా ఉన్నారు. నిజానికి హస్తం పార్టీలో షర్మిల తన పార్టీని విలీనం చేస్తుందని అంతాభావించారు. కానీ అది జరగలేదు. అయితే ఆమె టార్గెట్‌ మాత్రం వన్‌ అండ్‌ ఓన్లి కేసీఆర్‌ అని స్పష్టమవుతోంది. తాజాగా PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్‌ గతంలో ఇచ్చిన ప్రమాణాలను గుర్తు చేస్తూ... అవి ఫుల్‌ఫిల్ చేయలేదంటూ నిప్పులుచెరిగారు.


'ఇదేం లాజిక్ కేసీఆర్‌'?
'నేను ఇది చేశా.. అది చేశా.. మీకు ఇచ్చిన ప్రమాణాలను నేరవేర్చా'.. అని ఓట్లు అడగాలి కానీ.. 'వాళ్లను నమ్మద్దు.. వీళ్లను నమ్మద్దు..' అని కేసీఆర్‌ ఓట్లు అడుగుతుండడం విడ్డూరంగా ఉందన్నారు షర్మిల. తాను ఏం చేశారో చెప్పకుండా ఇతరులపై నిందలు వేస్తుండడం వెనుక లాజిక్‌ ఏంటో అంతుచిక్కడం లేదని చురకలంటించారు. కేసీఆర్‌కు గట్స్‌ ఉంటే.. దమ్ముంటే.. ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు షర్మిల. ఈ 10ఏళ్లలో కేసీఆర్‌ ఏం చేశారో ప్రజలకు వివరించాలని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నేరవేరలేదని.. వాటి గురించి ప్రస్తావించకుండా ఇతర పార్టీల గురించి ప్రచారాల్లో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కౌంటర్ వేశారు షర్మిల.

'అన్ని చెప్పారు.. ఏమీ చేయలేదు..'
అసలు ద్రోహులు కేసీఆర్, ఆయన మంత్రులేనని.. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని.. వాటిలో ఎన్ని నెరవేర్చారని షర్మిల ప్రశ్నించారు. 'ఆయన ద్రోహి కాకపోతే ఈరోజు తెలంగాణ ప్రజలకు ఓటేయండి అంటూ ముందుకు వెళ్లి ఉండేవారు' అని షర్మిల ఘాటు విమర్శలు చేశారు. ‘కేసీఆర్‌ను ఓడించేందుకు ద్రోహులు చేతులు కలిపారు’ అన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందనగా షర్మిల ఈ కౌంటర్ వేసినట్లు తెలుస్తోంది. రైతులకు రుణమాఫి చేస్తా అని కేసీఆర్‌ చెప్పారు.. 'ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు.. పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తానన్నారు.. ల్యాండ్‌ లేని వారికి 3ఎకరాల భూమి ఇస్తానన్నారు.. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ ఇస్తానన్నారు..' కానీ ఇవేవి కేసీఆర్‌ నేరవేర్చలేదని ఆరోపించారు షర్మిల.

Also Read: కేసీఆర్‌ గెటప్‌పై తిట్ల దండకం.. ‘కారు గాలి తీస్తూ’ సోషల్ మీడియాలో కాంగ్రెస్ యాడ్!

WATCH:

Advertisment
తాజా కథనాలు