BJP: ముందు అవమానం.. తర్వాత స్థానం.. రాములమ్మ, రఘునందన్‌కు స్టార్ క్యాంపెయినర్లగా చోటు! బీజేపీ స్టార్ క్యాంపెయినర్లగా ముందుగా విడుదల చేసిన జాబితాలో విజయశాంతి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్లు లేవు. అయితే తాజాగా ఈ ఇద్దరిని స్టార్ క్యాంపెయినర్లగా బీజేపీ ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. By Trinath 06 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి కావాలని కిందపడేసి తర్వాత సారీ చెబితే సరిపోతుందా? అవమానించి తర్వాత అవకాయ తినమని బుజ్జగించవచ్చా? ముందుగా 40మంది స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించిన బీజేపీ.. అందులో ఎక్కడా కూడా మాజీ ఎంపీ విజయశాంతి పేరు పెట్టలేదు. ఆ 40మందిలో కూడా ఆమెకు స్థానం ఇవ్వలేదంటే అది కచ్చితంగా అవమానమే.. రాములమ్మకు బీజేపీ రాం..రాం చెప్పిందంటూ అంతా అనేసుకున్నారు కూడా. విజయశాంతిని పక్కన పెట్టారంటూ కొంతమంది ఎగతాళి కూడా చేశారు. మరికొంతమంది బాధపడ్డారు. అందరూ మాటలు అనేసుకున్న తర్వాత బీజేపీ ఇప్పుడు విజయశాంతిని స్టార్‌క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది. విజయశాంతి, రఘునందన్ కు స్టార్ క్యాంపెయినర్లగా చోటు తెలంగాణ ఫైర్‌బ్రాండ్‌గా ప్రజలు ముద్దుగా పిలుచుకునే రాములమ్మను కమలం పార్టీ పక్కకు తోసేసింది. కాదు కాదు.. తోసేసి కిందపడిన తర్వాత మళ్లీ లేపింది. తాజాగా విజయశాంతితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్లు చేర్చింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ ఇద్దరిని స్టార్ క్యాంపెయినర్లగా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి నిర్ణయించినట్లు ఈ ప్రకటనలో ఉంది. Also Read: రేవంత్ రెడ్డి Vs పొంగులేటి.. తుంగతుర్తి, సత్తుపల్లి, పటాన్ చెరు, సూర్యాపేట టికెట్లపై లొల్లి! ఇది అవమానమే: తెలంగాణ ఫైర్‌బ్రాండ్‌గా పిలవబడుతున్న రాములమ్మను కమలం పార్టీ అవమానించింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మొదట విజయశాంతికి చోటు దక్కలేదు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించింది. అయితే ఇందులో విజయశాంతి పేరు మాత్రం కనబడలేదు. అయితే తదనంతరం విజయశాంతి, రఘునందన్‌రావుల పేర్లు చేరుస్తూ మరో లేఖ విడుదల చేసింది బీజేపీ అధిష్టానం. దీనిపై రాములమ్మ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే ఇటీవల విడుదల చేసిన బీజేపీ సెకండ్ లిస్ట్‌లో విజయశాంతి పేరు ప్రకటిస్తారనుకున్నా అలాంటిదేమీ జరగలేదు. దీంతో కమలం పార్టీలో కొత్త చర్చ మొదలైంది. రాములమ్మ పార్టీ మారుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం సోషల్ మీడియాలో ట్వీట్లు చేయడం తప్ప ఇతర ఏ రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. అలాగే కాంగ్రెస్‌లోకి వెళుతున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనాయతక్వంతో ఇటీవల విజయశాంతి చర్చలు జరిపారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే రాములమ్మను కమలం పార్టీ పక్కన పెట్టినట్లు సమాచారం. బీజేపీ నేతలు ఆమెను పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడు రాములమ్మ కాంగ్రెస్‌లోకి వెళుతున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇవన్నీ ఒక ఎత్తైతే.. అసలు విజయశాంతి మదిలో ఏముంది అన్న చర్చ కూడా జరుగుతోంది. పార్టీ మారేందుకు డిసైడ్ అయ్యారా..? ఎన్నికల ముందు రాజకీయ భవిష్యత్తుపై రాములమ్మ కీలక నిర్ణయమే తీసుకోనుందని తెలుస్తోంది. ఇటీవల.. కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు కొందరు కాంగ్రెస్‌లో చేరాలని కోరుతున్నారని.. మరికొందరు బీజేపీలోనే ఉండమంటున్నారని ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఇద్దరి అభిప్రాయం తెలంగాణ మేలు కోసమేనని.. సినిమాల్లో లాగా రాజకీయాల్లో డబుల్ యాక్షన్ కుదరదని ట్వీట్ చేశారు. దీంతో అసలు ఆమె ఏం చెప్పదలుచుకుంటున్నారనే విషయం ఎవరికీ అర్థం కాలేదు. పైగా ఇప్పటి వరకూ మూడు జాబితాలను బీజేపీ రిలీజ్ చేసినప్పటికీ ఇందులో రాములమ్మ పేరు లేదు. అలాగే ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ల లిస్టు నుంచి కూడా తీసేశారు. దీంతో రాములమ్మ కచ్చితంగా కండువా మార్చేస్తారనే టాక్ ఉంది. వాస్తవానికి బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన నాటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు పార్టీ కార్యక్రమాల్లో విజయశాంతి పాల్గొన్న దాఖలాల్లేవ్. పైగా ఢిల్లీ నుంచి పెద్దలు మోడీ, అమిత్ షా.. కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించినప్పటికీ ఎక్కడా రాములమ్మ కనిపించలేదు. దీంతో రాష్ట్ర నాయకత్వం.. ఎప్పటికైనా విజయశాంతి పార్టీ మారిపోతారని అప్పుడే డిసైడ్ అయ్యిందట. అందుకే.. విజయశాంతిని కమలం పార్టీ పట్టించుకోవట్లేదని సమాచారం. విజయశాంతి మదిలో ఏముంది..? మొత్తానికి చూస్తే.. రాములమ్మ మనసులో ఏదో ఉందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. విజయశాంతి అసంతృప్తిగా ఉండటం, కమలం పార్టీ పట్టించుకోని పరిస్థితుల్లో కాంగ్రెస్ అగ్రనాయతక్వం నుంచి.. అది కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి పిలుపు వచ్చినట్టు తెలిసింది. పార్టీలో తగిన ప్రాధాన్యంతో పాటు.. పదవి కూడా ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు మాటిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ హామీతో రాములమ్మ కమలం పార్టీకి రాజీనామా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. ఒకట్రెండు రోజుల్లో రాజీనామా చేసి.. కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. బీజేపీ క్యాంపెయినర్ల జాబితా ఇదే.. – నరేంద్ర మోదీ – జేపీ నడ్డా – రాజ్‌నాథ్ సింగ్ – అమిత్ షా – నితిన్ గడ్కరీ – యడ్యూరప్ప – లక్ష్మణ్ – యోగి ఆదిత్యనాథ్ – పీయూష్ గోయల్ – నిర్మలా సీతారామన్ – స్మృతి ఇరానీ – పురుషోత్తమ్ రుపాల – అర్జున్ ముండా – భూపేంద్ర యాదవ్ – కిషన్ రెడ్డి – సాధ్వి నిరంజన్ – జ్యోతి మురుగన్ – ప్రకాశ్ జవదేకర్ – తరుణ్ చుంగ్ – సునీల్ బన్సల్ – బండి సంజయ్ – అర్వింద్ మీనన్ – డీకే అరుణ – మురళీధర్ రావు – పురందేశ్వరి – రవి కిషన్ – పొంగులేటి సుధాకర్ రెడ్డి – జితేందర్ రెడ్డి – గరికపాటి మోహన్ రావు – ఈటల రాజేందర్ – ధర్మపురి అర్వింద్ – సోయం బాపూరావు – రాజా సింగ్ – కొండా విశ్వేశ్వర్ రెడ్డి – నర్సయ్య గౌడ్ – ప్రేమేందర్ రెడ్డి – ప్రదీప్ కుమార్ – బంగారు శృతి – కాసం వెంకటేశ్వర్లు – కృష్ణ ప్రసాద్ ఆఖరుగా ప్రకటించిన లిస్ట్.. - విజయశాంతి - రఘునందన్‌రావు Also Read: 16 మందితో కాంగ్రెస్ థర్డ్ లిస్ట్.. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి! Watch: #telangana-elections-2023 #bjp-raghunandan-rao #vijayashanti మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి