Telangana elections: చుక్కకు చుక్కెదురు.. ఎన్నికల వేళ ఫంక్షన్లలో దావత్ బంద్‌..!

ఎన్నికల వేళ ఆబ్కారీ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విందులు, పెళ్లిళ్లు లేదా ఏ ఫంక్షన్లలోనైనా మందు పార్టీ ఇవ్వాలనుకుంటే అబ్కారీ శాఖ పర్మిషన్‌తో పాటు బాండ్‌ రాసివ్వడం తప్పనిసరి చేసింది.

New Update
Telangana elections: చుక్కకు చుక్కెదురు.. ఎన్నికల వేళ ఫంక్షన్లలో దావత్ బంద్‌..!

'రాహుల్‌ తన పెళ్లికి పిలిచాడు. అందరం కలిసి వెళ్లాలని డిసైడ్ అయ్యాం.. మొన్న కాల్ చేసినప్పుడు మందు ఉంది.. దావత్‌ ఉంది. మీ ఇష్టం వచ్చినట్లు తాగొచ్చు అంటూ నోరు ఊరించాడు. వాడు చెబుతుంటేనే మందు తాగిన ఫీలింగ్ కలిగింది. వాడి పెళ్లికి ఇంకా కొద్ది రోజులే ఉంది. ఈ లోపే మళ్లీ ఫోన్ చేశాడు.. వాడి వాయిస్‌ బాధగా ఉన్నట్లు అనిపించింది. ఏమైందోనని భయంవేసింది.. పెళ్లికి ముందు ఇలా డల్‌గా మాట్లాడుతున్నాడేంటని టెన్షన్ వేసింది. ఏమైందో చెప్పారా అని వందసార్లు అడిగాను.. అది అది అంటూ తడపడుతూ అసలు విషయం చెప్పాడు.. అంతే నా గుండె పగిలింది.. నోటి నుంచి మాట రాలేదు.. పెళ్లి దావత్‌లో మందు లేదు అని రాహుల్ చెప్పిన ఆ మాట విన్న నాకు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది.. ఫోన్ ఆఫ్ చేసి అలా కూర్చిండిపోయా' ఇది తెలంగాణలో పెళ్లికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్న సగటు మందు ఫ్యాన్‌ దుస్థితి. ఇంతకి ఎందుకిలా జరిగింది? రాహుల్ మందు లేదని ఎందుకు చెప్పాడు?

ఆబ్కారీ శాఖ ఫోకస్:
తెలంగాణ(Telangana)లో ఏ ఫంక్షన్ జరిగినా మందు తప్పనిసరి. మందు లేదంటే చాలా మంది ఆ ఫంక్షన్‌కు రారు. మందు లేకపోతే వచ్చేదే లేదని ముఖం మీదే చెబుతారు. మందు లేకపోతే ముక్క దిగని వాళ్లు కూడా ఉంటారు. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మందుబాబులకు, పార్టీ కార్యకర్తలకు, బడా నేతలకు ఎలక్షన్‌ కమిషన్‌(EC) షాక్ ఇచ్చింది. పెళ్లిళ్లతో పాటు ఇతర ఫంక్షన్లు, విందుల్లో మద్యం సరఫరాపై ఎక్సైజ్‌ డిపార్టమెంట్‌ఫోకస్ పెట్టింది. రూల్స్‌ని టైట్‌ చేసింది. ఏదైనా వేడుక లేదా ఫంక్షన్లలో మందు పార్టీ చేసుకోవాలనుకుంటే ముందుగానే పర్మిషన్‌ తీసుకోవాలి. ఏ రాజకీయ పార్టీతోనూ తమకు లింక్‌ లేదని నిర్వాహకుల నుంచి ముందస్తుగా రూ.100 బాండు పేపర్‌పై హామీ తీసుకోవాలి. ఎన్నికల కోడ్‌ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బాండ్‌ పేపర్ రాసిస్తేనే మందుపార్టీకి అలో చేస్తారు.

ఈ నిర్ణయం రాజకీయ పార్టీలకు షాక్‌గానే చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల వేళ పార్టీలు, ఫ్రెండ్లీ మీటింగ్‌లు అంటూ ఏదో ఫంక్షన్ పేరు చెప్పి మందు పార్టీలు ఇస్తుంటారు. కార్యకర్తలతో పాటు గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లకు కూడా మందు పోస్తుంటారు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: వ్యాయామం చేసేవారు కచ్చితంగా ఇది తెలుసుకోవాలి.. లేకపోతే ఆ ప్రాబ్లెమ్ తప్పదు!
WATCH:

Advertisment
తాజా కథనాలు