TS election 2023: కేసీఆర్ గెటప్‌పై తిట్ల దండకం.. 'కారు గాలి తీస్తూ' సోషల్ మీడియాలో కాంగ్రెస్ యాడ్! ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న వేళ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సోషల్‌మీడియా ప్రచారాలపై మరింత దృష్టి పెట్టాయి. బీఆర్‌ఎస్ గులాబీల జెండలె పాటలతో హోరెత్తిస్తుంటే కాంగ్రెస్ వినూత్న యాడ్స్‌తో కేసీఆర్ టార్గెట్‌గా క్లిప్స్ రిలీజ్ చేస్తోంది. By Trinath 09 Nov 2023 in Latest News In Telugu రాజకీయాలు New Update షేర్ చేయండి Congress Targets KCR in Advertisements: ప్రచారంలో ఎవరి స్టైల్ వారిది.. ఎవరి క్రియేటివిటీ వారిది. ఓవైపు సోషల్‌మీడియాలో బీఆర్‌ఎస్ 'గులాబీల జాతర' వీడియోలతో దుమ్ములేపుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ తన మార్క్ అడ్వర్‌టైజ్‌మెంట్లతో అలరిస్తోంది. సోషల్‌మీడియా ప్రచారాల్లో ఈ రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. సినీ సెలబ్రెటీలు, బుల్లితెర తారలతో బీఆర్‌ఎస్ స్టెప్పులేయిస్తుంటే.. ఇటు కాంగ్రెస్ ఏకంగా బుల్లి బుల్లి సీన్లతో కేసీఆర్‌పైనే విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. ఏకంగా కేసీఆర్ గెటప్‌తో..ఆయన పోలికులన్న వ్యక్తిని తీసుకొచ్చి యాడ్స్ తీస్తోంది. వీటిని ఎడిట్ చేసి సోషల్‌మీడియాలో వదులుతోంది. అంతేకాదు ఈ యాడ్స్ ప్రస్తుతం టీవీ ఛానెల్స్ నడిపే బ్రేక్ టైమ్‌లోనూ దర్శనమిస్తున్నాయి. ఈ యాడ్స్ చూసి కొందరు నవ్వుకుంటుంటే.. మరికొంతమంది నిజమే తీశారని చెప్పుకుంటున్నారు. యాడ్ వైరల్: ఓట్లు అడగడానికి కేసీఆర్ గెటప్ ఉన్న వ్యక్తితో పాటు పక్కనే మరో ఎమ్మెల్యే గెటప్‌తో రైతుల వద్దకు వస్తారు. ఫొటోకు ఫోజులివ్వు తాతా అని కెమెరామ్యాన్ అడగడంతో రైతు చిందులేస్తాడు. రైతులు ఆత్మహత్యలను ప్రస్తావిస్తాడు. దీంతో కేసీఆర్ గెటప్‌లో ఉన్న ఓ వ్యక్తి ముఖం చిరాకుగా పెట్టి అదోటైపులో ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. రైతులు ఇన్ని మాటలు అన్న తర్వాత ఎవరైనా ఓటు వెయ్యమని అడుగుతారా? ప్రాక్టికల్‌గా అయితే అడగరు కానీ.. యాడ్ కదా కేసీఆర్ అడిగేస్తారు. దీంతో పక్కన ఉన్న మహిళ ఎందుకు వెయ్యాలి ఓట్లు అంటూ నిలదీస్తుంది. ఆమె డైలాగుకు కేసీఆర్ వేసుకొచ్చిన కారులో గాలి పోతోంది. అంటే కేసీఆర్ గాలి పోయిందని అర్థం.. వెంటనే అక్కడ నుంచి కారును తోసుకుంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు వెళ్లిపోతారు. కారును తోసుకుంటూ వెళ్తారు.. అయితే ఆ కారును తోసేవారిలో కేసీఆర్ గెటప్ పర్సన్ కూడా ఉండడం విశేషం. గాలిపోవడం మాత్రం కామన్ బాసూ! మరో యాడ్‌లోనూ ఇలానే కారు గాలి పోతుంది. ఈసారి కేసీఆర్ ఓట్లు అడగగానే యువకులు బండి మీద వచ్చి.. 'ఎందుకు వెయ్యాలి ఓట్లు, ఉద్యోగాలు ఇచ్చావా' అని నిలదీస్తారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదంటూ ఫైర్ అవుతారు. ఇంతలోనే మిగిలిన వాళ్లు వచ్చి ధరణి ఇవ్వలేదని.. డబుల్ బెడ్‌రూమ్ ఇవ్వలేదని.. కమిషన్లు కొట్టేశావ్ అంటూ మండిపడతారు. ఇన్ని మాటలు అనిన తర్వాత కూడా ఓటు వెయ్యమని బీఆర్‌ఎస్ నేత అనడం.. మళ్లీ తిట్టిచుకోవడం కారులో గాలిపోవడం.. ఇదే కాంగ్రెస్ ప్రచార స్టైల్. సోషల్‌మీడియాను ఈ విధంగా వాడుకుంటోంది కాంగ్రెస్. యూట్యూబ్ వీడియోల మధ్యలో వచ్చే యాడ్స్‌లోనూ ఈ తరహా ప్రచారం జరుగుతోంది. ఇన్‌స్టాతో పాటు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఈ ప్రచార వీడియోలు తెగ షేర్ చేస్తున్నారు. జనాలను అట్రాక్ట్ చేసేలా నటులను పెట్టడంతో పాటు తమ వాయిస్‌ను వినిపించేలా డైలాగులు పెడుతున్నారు. మరి చూడాలి కాంగ్రెస్ యాడ్ ప్రచారాలను బీఆర్‌ఎస్ ఎలా తిప్పికొడుతుందో.. ! Also Read: ఎక్కడ చూసినా గులాబీల జాతరే.. సోషల్ మీడియాలో దుమ్ములేపుతోన్న బీఆర్ఎస్! #congress #cm-kcr #telangana-elections-2023 #social-media-campaign మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి