TS elections 2023: బాబోయ్.. ఎన్నికల వేళ రోడ్లపైకి నోట్ల కట్టలు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో నగరంపై పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడికి అక్కడ తనిఖీలు చేస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో భారీగా హవాలా నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ.3.35 కోట్ల నగదును బంజారా హిల్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

TS elections 2023: బాబోయ్.. ఎన్నికల వేళ రోడ్లపైకి నోట్ల కట్టలు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!
New Update

ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో నగరంపై పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడికి అక్కడ తనిఖీలు చేస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో భారీగా హవాలా నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ.3.35 కోట్ల నగదును బంజారా హిల్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. కస్టమ్స్ అండ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్ సోదాల్లో డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. 216కేజీల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. దీని విలువ 469కోట్ల ఉంటుందని అంచనా. ఇక 40లక్షల విలువైన ఈ సిగెరెట్స్‌ను ధ్వంసం చేశారు. దండిగల్ వెస్ట్ మానేజ్మెంట్ ప్రాజెక్ట్‌లో డ్రగ్స్‌ను ధ్వంసం చేసింది కస్టమ్స్‌. విదేశాల నుంచి హైదరాబాద్ తరలిస్తున్న డ్రగ్స్‌ను పలు దఫాల్లో పట్టుకున్నారు.

This browser does not support the video element.

పట్టుకున్న డబ్బుల గురించి వెస్ట్ జోన్ డిసిపి జోయల్ డెవిస్ ప్రెస్ మీట్:

➼ భారత ఎన్నికల సంఘం ప్రకటన మేరకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది..

➼ ఎన్నికల కోడ్లో భాగంగా వాహన తనిఖీలు విస్తృతంగా చేపడుతున్నము.

➼ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ స్పోర్ట్స్ పోలీసులతోపాటు బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు.

➼ రోడ్ నెంబర్ 3 వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో ఆనుమనాస్పదంగా ఉన్న కియా కారును తనిఖీ చేసారు..

➼ కారును తనిఖీ చేయగా మూడు కోట్ల 35 లక్షల నగదు పట్టుబడింది.

➼ పట్టుబడిన నగదు హవాలా మనీగా గుర్తించాం..

➼ చింపిరెడ్డి హనుమంత రెడ్డి, బచ్చల ప్రభాకర్, మండల శ్రీరాముల రెడ్డి, ఉదయ్ కుమార్ లను అదుపులోకి తీసుకున్నం.

➼ నలుగురు ని నిందితులు ఏపీకి సంబంధించిన వారు.

➼ ప్రధాన సూత్రధారి చెంరెడ్డి అనుమతిగా గుర్తించిన పోలీసులు.

➼ హనుమంత్ రెడ్డి సూచన మేరకు ప్రభాకర్, శ్రీ రాములు, ఉదయ్ కుమార్ హవాల మని సేకరిస్తూ ఉంటారు

➼ గ్యాంగ్ వివిధ ప్రాంతాల్లో హవాలా మరిన్ని సేకరించి తరలిస్తూ ఉంటాడు..

➼ అరోరా కాలనీలో సాయి కృప బిల్డింగ్ ప్లాట్ నెంబర్ 583 తమ కార్యాలయాన్ని ఇందుకోసమే ఏర్పాటు చేసుకున్నారు.

➼ సేకరించిన హవాలా డబ్బులు తమ కార్యాలయానికి తీసుకెళ్తుండగా సీజ్ చేసాం.

➼ కోటి హవాలా మనీకి 25,000 కమిషన్ గా తీసుకుంటారు..

➼ ఇవాళ ఉదయం ప్రభాకర్ రెడ్డి హనుమంత్ రెడ్డి బేగం బజార్ నాంపల్లి గోషామహల్ జూబ్లీహిల్స్ మూడు కోట్ల 35 లక్షల ను కలెక్ట్ చేశారు

➼ పట్టుకున్న నగదును కోర్టులో సబ్మిట్ చేస్తాం.

➼ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాహన తనిఖీలు మరింత విస్తృతంగా చేస్తాం.

అమల్లో ఎన్నికల కోడ్‌:
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నిన్ననే షెడ్యూల్‌ ప్రకటించారు. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. దీంతో ఆ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు (Telangana Elections) జరగనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. రాజస్థాన్ లో 23న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. మధ్యప్రదేశ్, మిజోరాంలో నవంబర్ 7న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. ఛత్తీస్ ఘడ్ లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 7, 17 తేదీల్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 3నే కౌంటింగ్ నిర్వహించనున్నారు. దీంతో నిన్నటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.

పెరిగిన పోలీసుల నిఘా:
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు నగరాన్ని మరింత జల్లెడ పడుతున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎలాంటి లౌడ్ స్పీకర్లు యూజ్‌ చేయకూడదని ఎన్నికల ప్రధాని అధికారి వికాస్ రాజ్ తెలిపారు. స్టాటిక్ లేదా వెహికల్ మౌంట్ చేయకూడదన్నారు. మత స్థలాలు లేదా ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార వేదికగా ఉపయోగించకూడదని చెప్పారు. ఇక గతంలో జరిగిన కేసులు, గొడవలను దృష్టిలో పెట్టుకొని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్టు పోలీస్ కమిషనర్ సీ.వీ ఆనంద్ ఇప్పటికే చెప్పారు. మద్యం, డబ్బులు పంపిణీ, రవాణా, మత్తుపదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఆనంద్‌. 430 పోలింగ్ స్టేషన్లు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయన్నారు. ఇక 1,587 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. 32 కేంద్ర బలగాలు అవసరం అని భావిస్తున్నట్టు చెప్పారు. ఇదే క్రమంలో బంజారాహిల్స్‌లో భారీగా హవాలా డబ్బు పట్టింది.

ALSO READ: తాట తీస్తాం…! మద్యం, డబ్బుల పంపిణీ, రవాణా, మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి..!

#telangana-elections-2023 #hawala-money
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe