TS elections 2023: తాట తీస్తాం...! మద్యం, డబ్బుల పంపిణీ, రవాణా, మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి..! తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. రౌడీలు,గుండాలపై ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటామన్నారు పోలీస్ కమిషనర్ సీ.వీ ఆనంద్.మద్యం,డబ్బులు పంపిణీ, రవాణా, మత్తుపదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 24 గంటల పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు టీమ్స్ పని చేస్తాయన్నారు. 15 నియోజికవర్గాల్లో 15 మంది నోడల్ ఆఫీసర్లను పెట్టామని చెప్పారు. By Trinath 09 Oct 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తెలంగాణ(telangana)లో ఎన్నికలకు డేట్స్ ఫిక్స్ కావడంతో పోలీసులు మరింత అలెర్ట్ అయ్యారు. ఎన్నికలు సజావులగా జరిగేలా ఇప్పటినుంచే ప్లాన్స్ వేస్తున్నారు. గతంలో జరిగిన కేసులు, గొడవలను దృష్టిలో పెట్టుకొని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు పోలీస్ కమిషనర్ సీ.వీ ఆనంద్(CV anand). మద్యం,డబ్బులు పంపిణీ, రవాణా, మత్తుపదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు ఆనంద్. 430 పోలింగ్ స్టేషన్లు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయన్నారు. ఇక 1,587 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించామన్నారు. 32 కేంద్ర బలగాలు అవసరం అని భావిస్తున్నట్టు చెప్పారు. పోలీస్ కమిషనర్ సీ.వీ ఆనంద్ ఇంకా ఏం అన్నారంటే? • లైసెన్స్ ఉన్న వారు గన్లు తీసుకొని బయట తిరగొద్దు.. • రౌడీలు,గుండాలపై ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటాం.. • 652 మందిను బైండ్ ఓవర్ చేశాం.. • పి. డి యాక్ట్ 18 మందిపై ప్రయోగించాం • 24 గంటల పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు టీమ్స్ పని చేస్తాయి.. • అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ముందుకు పోతం.. • ఆన్లైన్ డబ్బులు పంపిణీ, ట్రాన్స్ఫర్‌పై ప్రత్యేక నిఘా పెట్టాం. • 15 నియోజికవర్గాల్లో 15 మంది నోడల్ ఆఫీసర్లను పెట్టాం. • బ్యాంక్ సహాయం తీసుకొని డిజిటల్ పేమెంట్‌పై ఫోకస్ చేయబోతున్నాం. తెలంగాణలో ఎన్నికల కోడ్: తెలంగాణలో మోడల్ ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చిందని, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులందరినీ ఎన్నికల కమిషన్‌కు డిప్యూటేషన్‌పై పరిగణనలోకి తీసుకున్నట్లు భావిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇక తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు. పురుషులు, మహిళలు సమాన నిష్పత్తిలో ఉన్నారు. ఇక తెలంగాణలో పాటు మరో 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్స్ ను (Telangana Election Schedule) ఈ రోజు విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్ (CEC). నవంబర్ 7వ తేదీన మిజోరాం, ఛత్తీస్ ఘడ్ ఫస్ట్ ఫేజ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్ ఘడ్ సెకండ్ ఫేజ్ ఎన్నికలు నవంబర్ 17న నిర్వహించనున్నారు. రాజస్థాన్ లో నవంబర్ 23న, తెలంగాణలో ఆఖరిగా నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. డిసెంబర్ 3న రిజల్ట్స్ రానున్నాయి. ALSO READ: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారా? ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది? #telangana-elections-2023 #ts-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి