TS elections 2023: రాత్రి 10 గంటల తర్వాత ఆ పని చేయవద్దు.. ఎన్నికల కోడ్‌లో ఏం ఉందంటే?

తెలంగాణలో మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కీలక సూచనలు చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎలాంటి లౌడ్ స్పీకర్లు యూజ్‌ చేయకూడదన్నారు వికాస్‌ రాజ్‌. ఇక మత స్థలాలు లేదా ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార వేదికగా ఉపయోగించకూడదు. స్టాటిక్ లేదా వెహికల్ మౌంట్ చేయకూడదు.

New Update
TS elections 2023: రాత్రి 10 గంటల తర్వాత ఆ పని చేయవద్దు.. ఎన్నికల కోడ్‌లో ఏం ఉందంటే?

ఎన్నికల కోడ్‌(Electoion code) అమల్లోకి వచ్చేసింది. తెలంగాణ ఎన్నికలు నవంబర్‌30న జరుగుతాయి. డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ ఉంటుంది. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అదే రోజు కౌంటింగ్‌ ఉంటుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 23న ఎన్నికలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో మోడల్ ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చిందని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(Vikas raj) తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులందరినీ ఎన్నికల కమిషన్‌కు డిప్యూటేషన్‌పై పరిగణనలోకి తీసుకున్నట్లు భావిస్తున్నట్లు చెప్పారు.

కీలక సూచనలు:

‣రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎలాంటి లౌడ్ స్పీకర్లు యూజ్‌ చేయకూడదు

‣ స్టాటిక్ లేదా వెహికల్ మౌంట్ చేయకూడదు.

‣ ఎలక్ట్రానిక్ మీడియాలో జారీ చేయడానికి ప్రతిపాదించిన అన్ని రాజకీయ ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్‌తో పాటు మానిటరింగ్ కమిటీ ముందస్తు ధృవీకరణ అవసరం.

‣ బ్యాలెట్ పత్రాలపై గుర్తులతో పాటు అభ్యర్థుల ఫోటోలు కూడా ఉండాలి.

‣ అభ్యర్థులు అఫిడవిట్‌లో అన్ని కాలమ్స్ తప్పనిసరిగా నింపాలి.

‣ ఎన్నికల అక్రమాలపై సీ విజిల్ యాప్‌తో పాటు 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి కంప్లెంట్ చేయొవచ్చు.

‣ పోలింగ్ రోజున దివ్యాంగులు, సీనియర్ సిటిజన్‌లకు పోలింగ్ బూత్‌లకు రవాణా సౌకర్యం కల్పిస్తాం.

‣ అక్రమార్కులు, మాదక ద్రవ్యాలు, నగదు మద్యం లేదా ఫ్రీబీలను నియంత్రించేందుకు చర్యలు

‣ అక్రమార్కులను అరికట్టేందుకు వీడియో టీమ్‌లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు

‣ గరిష్టంగా ఒక పోలింగ్‌ స్టేషన్‌లో 1500 మంది ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు

‣ పథకాల ప్రారంభోత్సవం లేదా ప్రకటన నిషేధం

‣ మత స్థలాలు లేదా ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార వేదికగా ఉపయోగించకూడదు.

దివ్యాంగుల కోసం తొలిసారి:
పోలింగ్ రోజున వికలాంగులు, సీనియర్ సిటిజన్‌లకు పోలింగ్ బూత్‌లకు రవాణా సౌకర్యం కల్పించనున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా సీనియర్ సిటిజన్లు, పిడబ్ల్యుడి ఓటర్లకు ఇంటింటికి ఓటు వేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వికాస్‌ రాజ్‌ తెలిపారు. ఇక దివ్యాంగ ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపుల ఏర్పాటుతో పాటు మిగిలిన సౌకర్యాలు కల్పించడంపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. సీనియర్ సిటిజన్లు, PWD ఓటర్లకు రిటర్నింగ్ అధికారితో పాటు సంబంధిత పోలింగ్ అధికారులు నియమించిన వాలంటీర్లు సహాయం చేస్తారు. ప్రత్యేక ఎంట్రీ లైన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు వికాస్‌ రాజ్‌.

ALSO READ: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పుతారా? ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు