కాంగ్రెస్ తో ధరలు తగ్గుతాయి.. రేవంత్ కీలక వ్యాఖ్యలు!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని అన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు.

New Update
కాంగ్రెస్ తో ధరలు తగ్గుతాయి.. రేవంత్ కీలక వ్యాఖ్యలు!

Telangana Elections 2023: సీఎం కేసీఆర్ (KCR) , కేటీఆర్ పై (KTR) విమర్శలు గుప్పించారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy). మరోసారి బీఆర్ఎస్ పార్టీని (BRS Party) అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈరోజు కామారెడ్డిలో పర్యటించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే గల్ఫ్‌ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకు చెందిన కార్మికులకు ఇతర దేశాల్లో అన్యాయం జరిగితే న్యాయం చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఆదుకుంటామని అన్నారు.

ALSO READ: ఓటు వెయ్యకపోతే సచ్చిపోతా.. కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇండ్లు వచ్చాయని.. కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఎవరికీ రాలేదని ఫైర్ అయ్యారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉంది తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయంలో సోనియా గాంధీ అందరికీ రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తే ఈ రోజు కేసీఆర్, మోదీ ప్రభుత్వాలు రూ.1300 చేశాయని.. విపరీతంగా పెరిగిన ఈ ధరలతో ప్రజల బతుకులు నలిగిపోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. నిత్యావసర ధరలు తగ్గాలన్న, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్న కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావాలని అన్నారు. రైతు బంధు ఆగిందని రైతు బాధపడొద్దని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు ఏడాదికి ఎకరాకు రూ.15,000 అకౌంట్లో పడుతాయని అన్నారు.

తెలంగాణలో అరాచక పాలన పోయి ప్రజల పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, రైతుల పార్టీ అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి అందరు ఓటు వేయాలని అన్నారు.

ALSO READ: BIG BREAKING: తెలంగాణలో 144 సెక్షన్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు