Pawan Kalyan: రేపు, ఎల్లుండి తెలంగాణలో పవర్ స్టార్ ప్రచారం.. ఆ స్థానాలపై స్పెషల్ ఫోకస్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు వరంగల్ లో ఎల్లుండి కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ షెడ్యూల్ ను విడుదల చేసింది.

New Update
Pawan Kalyan: రేపు, ఎల్లుండి తెలంగాణలో పవర్ స్టార్ ప్రచారం.. ఆ స్థానాలపై స్పెషల్ ఫోకస్!

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 22, 23 తేదీల్లో పవన్ కల్యాణ్ వివిధ నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు జనసేన పార్టీ (Janasena) ప్రకటన విడుదల చేసింది. వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో ఆయన పర్యటించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పవన్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Telangana Elections 20203: కాంగ్రెస్ నేతలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన కేటీఆర్‌..

  • 22న మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్
  •  23వ తేదీ ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 11 గంటలకు సూర్యాపేట, సాయంత్రం 4.30 గంటలకు దుబ్బాకలో..

పవన్ తదుపరి షెడ్యూల్ కు సంబంధించిన వివరాలను తర్వాత ప్రకటిస్తామని జనసేన పార్టీ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థిగా లక్కినేని సురేందర్ ఉన్నారు. చిరంజీవి అభిమానులైన లక్కినేని ఫ్యామిలీ ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలోనూ అండగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెం నుంచి ఆయనకు అవకాశం కల్పించారు పవన్ కల్యాణ్‌.

తాజాగా సురేందర్ కోసం కొత్తగూడెంలో ప్రచారం నిర్వహించడానికి వస్తున్నారు పవర్ స్టార్. ఇదిలా ఉంటే సూర్యాపేటలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు పోటీలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇచ్చిన సంకినేని పవన్ ప్రచారం తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇటీవల అమిత్‌ షా సైతం సూర్యాపేట బీజేపీ మీటింగ్ కు హాజరయ్యారు. దుబ్బాకలో రఘునందన్ రావు గెలపు కోసం పవన్ కల్యాణ్ ప్రచారానికి రావడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచుతోంది.

Advertisment
తాజా కథనాలు