Telangana Elections 2023: రేపటితో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ప్రస్తతం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు ప్రధాని మోదీ (PM Modi). కరీంనగర్‌లో (Karimnagar) బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ (Bandi Sanjay) ను గెలిపించాలని కోరారు.
ALSO READ: మందు బాబులకు ALERT.. రేపటి నుండి వైన్స్ బంద్!
ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారతదేశం.. తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు అంటూ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి ప్రజలను ఆకట్టుకున్నారు ప్రధాని మోదీ. తెలగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కానున్నారు అని మరోసారి తెలిపారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ((Petrol, Diesel Rates) తగ్గించమని పేర్కొన్నారు. బీజేపీ (BJP) సర్కారు వస్తేనే తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని స్పష్టం చేశారు. మోదీ అంటే కేసీఆర్‌కు (KCR) భయమని.. మోదీ వస్తే ఎయిర్‌పోర్టుకు కూడా రాకుండా తప్పించుకునేవారని సెటైర్లు వేశారు. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తవుతుందని అన్నారు.
ALSO READ: పెన్షన్ రూ.5000.. కేసీఆర్ సంచలన ప్రకటన!
డిసెంబర్ 3 తర్వాత లిక్కర్ స్కాంపై (Liquor Scam) దర్యాప్తు వేగవంతం చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని. తెలంగాణ వచ్చే ఐదేళ్లలో దేశంలోనే నంబర్ వన్ కావాలని అన్నారు. అభివృద్ధికి ఓటేయాలంటే బీజేపీకే ఓటేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో మార్పు గాలి వీస్తోంది.. మార్పు తథ్యం మోదీ జోస్యం చెప్పారు. ప్రజలను మోసం చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ బీఆర్ఎస్, కాంగ్రెస్ వదిలిపెట్టలేదని తేల్చి చెప్పారు.