MLC Kavitha: ఎప్పటికీ మా నాన్నే నా హీరో.. కవిత ట్వీట్ కు అర్థం అదేనా?

రేపు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న వేళ ఎమ్మెల్సీ కవిత చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మై హీరో అంటూ కేసీఆర్ నడిచి వస్తున్న ఓ వీడియోను కవిత తన ట్విట్టర్ (X) లో పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు అనేక విధాలుగా ఈ ట్వీట్ పై కామెంట్లు చేస్తున్నారు.

MLC Kavitha: ఎప్పటికీ మా నాన్నే నా హీరో.. కవిత ట్వీట్ కు అర్థం అదేనా?
New Update

తెలంగాణ ఎన్నికలు (Telangana Elections 2023) ముగిశాయి. మరికొన్ని గంటల్లో కౌంటింగ్ స్టార్ట్ కానుంది. అయితే.. ఈ సారి కాంగ్రెస్ గెలుపు ఖాయమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కేసీఆర్ ను (CM KCR) గద్దె దించుతున్నామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మళ్లీ అధికారం తమదేనని బీఆర్ఎస్ (BRS) నేతలు కూడా అంతే ధీమాగా చెబుతున్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందా? కేసీఆర్ మూడో సారి సీఎం అవుతారా? అన్న అంశంపై భారీగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

మై హీరో అంటూ కేసీఆర్ నడిచి వస్తున్న ఓ వీడియోను ఆమె షేర్ చేశారు. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో 'ఆయనంటే ఓ హీరో ఫీలింగ్.. మనిషికి జీవితంలో ఒకరే హీరో ఉంటారు. నా జీవితానికి ఆయనే హీరో' అంటూ వాయిస్ ఉంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఈ పోస్టుకు కామెంట్లు చేస్తున్నారు. హ్యాట్రిక్ సీఎం అని, లెజెండ్ అని కొందరు తమ కామెంట్లను పోస్టు చేస్తున్నారు.

మరికొందరైతే కేసీఆర్ హైలెట్ స్పీచ్ లను కామెంట్లలో పోస్టు చేస్తున్నారు. నాకు కూడా అభిమాన హీరో కేసీఆర్ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. రేపు ఫలితాల్లో కేసీఆర్ గెలవబోతున్నాడని ఆ అంచనాతోనే కవిత ఇలా ట్వీట్ చేశారని కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. కేసీఆర్ ఓడిపోబోతున్నారన్న భావోద్వేగంతోనే కవిత ఇలా చేశారంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

#mlc-kavitha #telangana-elections-2023 #cm-kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe