నన్ను కష్ట పెట్టారు.. సీతక్క ఎమోషనల్!

ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతలు తనను చాలా ఇబ్బందికి గురి చేశారని అన్నారు ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

New Update
Minister Seethakka: మేడం కాదు.. సీతక్క అని పిలవండి.. అధికారులకు మంత్రి సూచన..

MLA Seethakka: తెలంగాణలో ఎన్నికల పండుగ ముగిసి.. ఫలితాల పోరు షురూ అయింది. మరికొన్ని గంటల్లో తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. తాజాగా ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో తనను చాలా ఇబ్బంది పెట్టినట్లు వెల్లడించారు.

ఈ రోజు ములుగు జిల్లాలో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. తనను ఆడబిడ్డల ములుగు ప్రజలు ఆదరించారని అన్నారు. చిన్న పిల్లలు కూడా తనకే మద్దతు ఇచ్చి అక్కున చేర్చుకున్నారని పేర్కొన్నారు. తన జీవితానికి ఇంకేం కావాలని అన్నారు. తన గెలుపుకోసం కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు
నేనెప్పుడూ మీ సేవకు రాలినే అని అన్నారు.

ALSO READ: మందుబాబులకు షాక్.. తెలంగాణలో రేపు వైన్ షాప్‌లు బంద్..

ములుగు ప్రజల కోసం ఎల్లప్పుడూ పని చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంతో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. తనను రీల్ అన్నారని.. కష్టకాలంలో ప్రజల వెంటే ఉన్నట్లు పేర్కొన్నారు. వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. ఆడబిడ్డ ఉసురు తగులుతుందని తెలిపారు.

బీఆర్ఎస్ నాయకులు మార్ఫింగ్ వీడియో, ఫోటోలతో దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. తన కార్యకర్తలను పైసలతో కొనుగోలు చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారని ఫైర్ అయ్యారు. ఏ కష్టం వచ్చినా జనం వెంటే ఉంటా అని తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాహూల్ ప్రధాని అయ్యేలా కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల్లో కష్ట పడ్డ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చేది ఇందిరమ్మ రాజ్యం.. వెలుగులే ప్రతి ఇంటా అంటూ ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ: ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!

Advertisment
తాజా కథనాలు