'నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు'.. అంటూ కాంగ్రెస్ పై హరీష్ సెటైర్లు! కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు ఉండేవని అని అన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ మాటలు నమ్మితే మోసపోవడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 25 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో రాజకీయ నేతలందరూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు అనేక మార్గాల్లో ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు (Harish Rao) బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీని ఉద్దేశిస్తూ చేస్తున్న ప్రచారం వైరల్ గా మారింది. ఈరోజు నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. నర్సంపేటలో రోడ్ షో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మోటార్లకు మీటర్లు పెట్టలేదని కేంద్రం తెలంగాణకు రూ. 25 వేల కోట్లు నిధులు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. ALSO READ: రైతులకు రూ.300కే యూరియా.. కామారెడ్డిలో మోదీ! కాంగ్రెస్ పాలనలో నల్లా నీళ్లు రాలేదని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నళ్లా ద్వారా తాగునీరు పంపిణీ చేస్తున్నామని అన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రిలు దారుణంగా ఉండేవని.. కాంగ్రెస్ హయాంలో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అని పాటలు ఉండేవని అన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మితే మోసపోతామని హెచ్చరించారు. కాంగ్రెస్ చెబుతున్న మార్పు ఏంటి? అని ప్రశ్నించారు. పాలకుర్తి ప్రజలు నోట్ల కట్టలకు అమ్ముడుపోయే వారు కాదు అని అన్నారు. పాలకుర్తి ప్రజల ఆత్మగౌరవాన్ని కొనలేరని వ్యాఖ్యానించారు. నోట్ల కట్టలున్నాయన్నది వారి అహంకారం అని అన్నారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉండేదో 50 ఏళ్లు చూశాం.. 50 ఏళ్లు అధికారమిస్తే కాంగ్రెస్ ఏం చేసింది? అని ప్రశ్నించారు. రైతుబంధు ద్వారా 11 విడతల్లో 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ALSO READ: రూ.15 లక్షలు వచ్చాయా?.. మోదీపై ఖర్గే చురకలు! #telangana-elections-2023 #telugu-latest-news #breaking-news #harish-rao #congress-bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి