KTR: కొత్త రేషన్ కార్డులపై కేటీఆర్ సంచలన ప్రకటన!

ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం.. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

KTR: కొత్త రేషన్ కార్డులపై కేటీఆర్ సంచలన ప్రకటన!
New Update

Telangana Elections 2023: తెలంగాణలో ప్రచారం చేసుకునేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అనేక రకాలుగా ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ (KTR) బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను (BRS Manifesto) ప్రజలకు అర్ధం అయ్యే విధంగా ప్రచారం చేస్తున్నారు.

ALSO READ: పెన్షన్ రూ.5000.. కేసీఆర్ సంచలన ప్రకటన!

ఈరోజు చొప్పదండి (Choppadandi) మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన రోడ్ షో లో ఆయన పాల్గొన్నారు. రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ హయాంలో పింఛన్‌ రూ.200 ఇచ్చేవారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు రూ.2 వేలు ఇస్తాం అంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌ నేతల మాటలను నమ్ముతామా? అంటూ తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు.

2014లో రూ.400 ఉన్న సిలిండర్‌ మోదీ (Modi) హయాంలో ప్రస్తుతం రూ.1200 అయ్యిందని అన్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder) ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో కరెంట్ కష్టాలు ఉండేవని తెలిపారు. కేసీఆర్ పాలనలో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వ్యాఖ్యానించారు.

మంత్రి కేటీఆర్ రేషన్ కార్డులపై (Ration Cards) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనవరి నుంచి కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని వెల్లడించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.

ALSO READ: రైతులకు రూ.300కే యూరియా.. కామారెడ్డిలో మోదీ!

#breaking-news #ktr #telangana-elections-2023 #ration-cards #telugu-latest-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe