కొడంగల్ లో రేవంత్ మాస్టర్ స్కెచ్.. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మామ!

రాష్ట్రం అంతా తిరుగుతూనే సొంతి నియోజకవర్గం కొడంగల్ పై ఓ లుక్కేసి ఉంచుతున్నారు రేవంత్. ఈ నేపథ్యంలో ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మామ జగన్నాథ రెడ్డి గులాబీ గూటికి చేరేలా చక్రం తిప్పారు. దీంతో ఈ రోజు జగన్నాథ రెడ్డి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

New Update
కొడంగల్ లో రేవంత్ మాస్టర్ స్కెచ్.. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మామ!

ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రత్యుర్థులను ఓడించాలన్న లక్ష్యంతో అభ్యర్థులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. గతేడాది కొడంగల్ లో ఓటమి పాలైన రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ ఎన్నికల్లో కొడంగల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లోనూ విజయం సాధించాలన్న లక్ష్యంతో ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రం అంతా తిరుగుతూనే కొడంగల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు రేవంత్. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మామ జగన్నాథ్ రెడ్డి పార్టీలో చేరేలా చక్రం తిప్పారు.
ఇది కూడా చదవండి: Big Breaking: ప్రచారంలో స్పృహ తప్పి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత

రేవంత్ రేవంత్ వ్యూహం పలిచింది. దీంతో నరేందర్ రెడ్డి మామ జగన్నాథ్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ గూటికి చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ రోజు ఉదయం ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజినీ కుమారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అభ్యర్ధికి భూకబ్జాలు మాత్రమే తెలుసు.!

రజనీ కుమారి గతంతో టీడీపీ నుంచి నకిరేకల్, తుంగతుర్తిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరారు. అయితే.. ఈ ఎన్నికల్లో బీజేపీ ఆమెకు టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి గుడ్ బై చెప్పినట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు