/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Telangana-Political-Leaders-jpg.webp)
Telangana MLA Contested Candidates List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేష్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు దాదాపు 3 వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2,478 నామినేషన్లు దాఖలైతే.. నామినేషన్లకు చివరి రోజైన ఇవాళ అంటే శుక్రవారం నాడు మధ్యాహ్నం 3 గంటల వరకు 900 వరకు నామినేషన్లు ఫైల్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల పైచిలుకు నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ వరకు గడువు ఉంది. అయితే, ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ బీఫామ్స్ అందుకున్న నాయకులు దాదాపు పోటీలో నిలుస్తారు. రెబల్స్, చిన్నా చితకా పార్టీలకు చెందిన నేతలు తమ తమ నామినేషన్లను ఉపసంహరించుకునే ఛాన్స్ ఉంది. అయితే, ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారో పూర్తి లిస్ట్ మీకోసం అందిస్తున్నాం. పూర్వ ఉమ్మడి జిల్లాల వారీగా ఆ వివరాలు ఇక్కడ చూడండి..
Also Read:
లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్.. మరో అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్.. ఎవరంటే..