కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కొద్ది సేపటి క్రితం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటకు రావడం గొప్ప విషయమన్నారు. వారికి ఆ శక్తిని ఇచ్చినందుకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశానన్నారు. ప్రభుత్వ యంత్రాంగం చాలా సమర్థవంతంగా పని చేసిందని కితాబిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని..ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. ప్రజలు దేశ, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని అమ్మవారిని కోరుకున్నాన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఆత్మసాక్షిగా ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి.
ఇది కూడా చదవండి: Telangana Elections 2023: కరీంనగర్ లో అర్ధరాత్రి హైటెన్షన్..పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదం
ఇదిలా ఉంటే.. హోరాహోరీగా సాగిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం నిన్న సాయంత్రం 5 గంటలతో ముగిసింది. దీంతో అగ్ర నేతలు కాస్త రిలాక్స్ అవుతున్నారు. పలువురు నేతలు దేవాలయాల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి వివిధ పార్టీల ముఖ్య నేతలు క్యూ కడుతున్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.
ఇది కూడా చదవండి: Telangana Elections: కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశం..
మరికొద్ది సేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎన్నికల సమయం.. అసలే ఓల్డ్ సిటీలో ఈ ఆలయం ఉండడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్రనేతలు వస్తుండడంతో భారీగా నిఘా పెంచారు.