కాంగ్రెస్ MLA లతో కేసీఆర్ టచ్ లో ఉన్నారు.. KA పాల్ సంచలన వ్యాఖ్యలు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ టచ్ లో ఉన్నారని అన్నారు. అవినీతి చక్రవర్తిగా సీఈఓ వికాస్ రాజ్ మారుతున్నారని ఫైర్ అయ్యారు. తుంగతుర్తిలో 30 ఈవీఎంలు కనబడటం లేదంటూ ఆరోపణలు చేశారు. By V.J Reddy 02 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KA Paul Comments On Election Commission: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని 30 స్థానాల్లో ఈవీఎంలు కనిపించడం లేదని అన్నారు. ఈ నెల 30న రాత్రి తుంగతుర్తిలో ఈవీఎంలు కనబడటం లేదంటూ ఆరోపణలు చేశారు. ఇది బీఆర్ఎస్ చేస్తున్న కుట్ర అని అన్నారు. ALSO READ: మందుబాబులకు షాక్.. తెలంగాణలో రేపు వైన్ షాప్‌లు బంద్.. అవినీతి చక్రవర్తిగా సీఈఓ వికాస్ రాజ్ మారుతున్నారని, ఆయనపై చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. కేసీఆర్.. తన వద్ద ఉన్న డబ్బుతో వికాస్ రాజ్ కొనేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్వోలు అవినీతి చేస్తు న్నారంటూ తాను వికాస్ రాజ్ కు అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు 58- 63 సీట్లు వస్తున్నాయంటూ సర్వేలు చెబుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులతో కేసీఆర్, కేటీఆర్ టచ్ లో ఉండి వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ALSO READ: ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు! #ka-paul #telangana-elections-2023 #kcr-in-touch-with-congress-mla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి