Gulabeela Jendalamma Song: హరీశ్‌రావు నోట రామక్క పాట.. కాంగ్రెసోళ్లు నకలు కొట్టారంటూ సెటైర్లు..

తమ పార్టీ కోసం రూపొందించిన గులాబీల జెండలే రామక్క సాంగ్ సూపర్ హిట్ అయ్యిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. దీంతో ఈ పాటను కాంగ్రెసోళ్లు కాపీ కొట్టారంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ వాళ్ల దగ్గర అసలు ఉండదని.. అంతా నకిలీనే అంటూ హుస్నాబాద్ ప్రచారంలో నవ్వులు పూయించారు.

Gulabeela Jendalamma Song: హరీశ్‌రావు నోట రామక్క పాట.. కాంగ్రెసోళ్లు నకలు కొట్టారంటూ సెటైర్లు..
New Update

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) ఈ సారి రామక్క పాట స్పెషల్ అట్రాక్షన్. గులాబీల జెండలమ్మ (Gulabeela Jendalamma) అంటూ.. స్టార్ట్ అయ్యే ఈ పాట టీఆర్ఎస్ కార్యకర్తలను ఉర్రూతలూగించింది. సెలబ్రేటీలు కూడా ఈ పాటకు రీల్స్ చేయడంతో మరింత వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే ఇంకా వినిపిస్తోంది. ఈ పాట పాడిన కళాకారుల బృందానికి కూడా మంచి పేరు వచ్చింది. ఎన్నికలు హడావుడి ప్రారంభమైన సమయంలో ఆ మ్యూజిక్ వినపడితే చాలు టీఆర్ఎస్ ప్రచారం అన్న భావన అందరిలో వ్యక్తం అయ్యే పరిస్థితి ఉండేది. అయితే.. బీట్ బాగుండడం, ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ట్యూన్ ఉండడంతో అన్ని పార్టీలు ఆ పాటను కాపీ కొట్టేశాయి.

ఇది కూడా చదవండి: Revanth Reddy: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సంచలన సవాల్!

అన్ని పార్టీల అభ్యర్థులు వారి పేరు, వివరాలు ఉండేలా ఈ పాటను మార్చి రికార్డింగ్ చేయించుకుని వాడుకుకంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన మ్యూజిక్ అన్ని పార్టీల ప్రచారంలోనూ వినిపిస్తోంది. దీంతో ఏ పార్టీ వారి పాటో అర్థం కానీ పరిస్థితి ప్రజలకు ఏర్పడింది. ఈ అంశంపై బీఆర్ఎస్ కీలక నేత, ఆర్థిక మంత్రి హరీశ్ రావు (Harish Rao) నిన్న హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో స్పందించారు. మన రామక్క పాటను కూడా కాంగ్రెసోళ్లు కాపీ కొట్టేశారు అంటూ సెటైర్లు వేశారు.

ఆ పాట సూపర్ ఉందని.. ఊపుడు ఊపుతోందన్నారు. దీంతో ఈ పాటకు కొట్టుకుపోతామని కాంగ్రెస్ నేతలు భయపడ్డారని సెటైర్లు వేశారు. దీంతో దాన్ని నకలు కొట్టారని నవ్వులు పూయించారు. కాంగ్రెస్ వాళ్లది అసలు ఏదీ ఉండదని.. అంతా డుబ్లికేటేనంటూ పంచ్ లు విసిరారు.

#harish-rao #telangana-elections-2023 #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe